Sonakshi Sinha: కారణం ఏదైనా అదే ధ్యాసలో ఉంటున్నారు.. సోనాక్షి కౌంటర్
ABN, Publish Date - Jul 06 , 2024 | 03:33 PM
బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రఘ్న సిన్హా (Shatrughan sinha) కుమార్తె సోనాక్షి సిన్హా (Sonakshi sinha) ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే! తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను జూన్ 23న ప్రేమ వివాహం చేసుకుంది.
బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రఘ్న సిన్హా (Shatrughan sinha) కుమార్తె సోనాక్షి సిన్హా (Sonakshi sinha) ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే! తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను జూన్ 23న ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి చెప్పుకొచ్చింది సోనాక్షి. తన తాజా చిత్రం ప్రమోషన్ లో పాల్గొన్న ఆమె కొద్దిరోజులుగా తనపై వస్తోన్న ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై (Pregnancy Rumors) స్పందించారు.
‘పెళ్లికి ముందు నేను ఎంత సంతోషంగా ఉండేదాన్నో ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. జీవితం ఇంతకంటే అందంగా, గొప్పగా ఉండదేమో అనిపిస్తోంది. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలాంటి మార్పు లేదు. మళ్లీ నా సినిమాల చిత్రీకరణను ప్రారంభించడం సంతోషంగా ఉంది. పెళ్లి తర్వాత వచ్చిన ఒకే ఒక్క మార్పు ఏంటంటే.. ఇకపై మేము హాస్పిటల్‌కు వెళ్లాలనుకోవడం లేదు. ఎందుకంటే మేము అక్కడ కనిపిస్తే చాలు ప్రెగ్నెంట్ అని గోల గోల చేస్తున్నారు. ఆస్పత్రికి ఎందుకు వెళ్లారు అనేది ఆలోచించకుండా ప్రెగ్నెంట్.. అంటూ ఇదొక్క టే ఆలోచనలో ఉంటున్నారు’ అని అన్నారు. ఇటీవల తన తండ్రి శత్రుఘ్న సిన్హా జ్వరం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆయన్ని పరామర్శించడం కోసం సోనాక్షి అక్కడకు వెళ్లారు. దీంతో అప్పటి నుంచి ఆమెపై ఈ రూమర్స్ మొదలయ్యాయి.