Kajol: విమానం కూలి చనిపోయానన్నారు
ABN, Publish Date - Oct 27 , 2024 | 07:02 PM
బాలీవుడ్ నటి కాజోల్ (Kajol) కీలక పాత్ర పోషించిన చిత్రం ‘దో పత్తి’ (Do Patti). శుక్రవారం నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. కృతిసనన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది.
బాలీవుడ్ నటి కాజోల్ (Kajol) కీలక పాత్ర పోషించిన చిత్రం ‘దో పత్తి’ (Do Patti). శుక్రవారం నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. కృతిసనన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. ఇందులో ఆమె ద్విపాత్రాభినయం చేశారు. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి శశాంక చతుర్వేది దర్శకత్వం వహించారు. కవలలైన అక్కా చెల్లెళ్ల రహస్యాలను వెలికితీేస పోలీసు అధికారి పాత్రలో కాజోల్ నటించారు. ‘బ్లూ బటర్ ఫ్లై ఫిల్మ్స్’ పతాకం పై కృతి నిర్మించిన తొలి చిత్రమిది. ఈ సినిమా పమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం తాజాగా ‘ది కపిల్ శర్మ షో’లో సందడి చేసింది. ఈ సందర్భంగా కాజోల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చనిపోయినట్లు చాలా సందర్భాల్లో వార్తలు వచ్చాయని, వాటిని చూసి షాక్ అయ్యానని అన్నారు.
ఈ షోలో మీ గురించి మీరు చదివిన వింత వార్తలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించగా.. ‘‘చాలా ఉన్నాయి. ఏకంగా నేను చనిపోయినట్లు వార్తలు రాశారు. వాటిని చూసి షాక్ అవ్వడం నా వంతు అయింది. ఒకటి కాదు రెండు కాదు చాలా సార్లు మీడియాలో ఇలా రాశారు.. దాదాపు ఐదేళ్లకొకసారి ఇలాంటివి వస్తుంటాయి. ఇంటర్నెట్ లేని రోజుల్లో గుర్తు తెలియని వ్యక్తి మా అమ్మకు ఫోన్ చేసి.. విమాన ప్రమాదంలో నేను చనిపోయానని (kajol plane crashed))చెప్పాడు. ఇంట్లోవాళ్లు కంగారుపడ్డారు. ఇటీవల యూట్యూబ్‌లో నేను మృతి చెందినట్లు వార్తలు కనిపించాయి. నా గురించి ఎలాంటి వార్తలు వచ్చాయి? ఎవరు ఎలా మాట్లాడుకుంటున్నారు? అని గూగుల్ చేయను. నాపై ఏదైనా సంచలన కథనాలు వస్తే స్నేహితులు నాకు పంపిస్తుంటారు. వాటిని చదివినప్పుడు ఇలా ఎలా రాస్తారు అనిపిస్తుంది’’ అని కాజోల్ తెలిపారు.