40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indian Police Force: ఓటీటీలోకి వ‌చ్చిన బాలీవుడ్ స్టార్స్ తొలి వెబ్ సిరీస్‌.. ఎలా ఉందంటే!

ABN, Publish Date - Jan 19 , 2024 | 03:22 PM

బాలీవుడ్ స్టార్ సిద్ధార్థ మల్హోత్రా , నటి శిల్పాశెట్టి, వివేక్‌ ఓబెరాయ్ న‌టించిన ఓ భారీ యాక్ష‌న్ వెబ్ సిరీస్ ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ . డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు భారీ నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా పేరున్న రోహిత్ శెట్టి వెబ్ సిరీస్‌ల‌లోకి ఎంట్రీ ఇస్తూ దీన్ని తెర‌కెక్కించారు.

indian police force

బాలీవుడ్ స్టార్ సిద్ధార్థ మల్హోత్రా (Sidharth Malhotra), నటి శిల్పాశెట్టి, వివేక్‌ ఓబెరాయ్ (vivekoberoi) న‌టించిన ఓ భారీ యాక్ష‌న్ వెబ్ సిరీస్ ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ (Indian Police Force). డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు భారీ నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా పేరున్న రోహిత్ శెట్టి (Rohit Shetty) వెబ్ సిరీస్‌ల‌లోకి ఎంట్రీ ఇస్తూ దీన్ని తెర‌కెక్కించారు. ఈ సిరీస్‌లో తొలి సీజ‌న్‌గా వ‌స్తున్న ఈ సినిమా టెర్రరిస్టులకు, పోలీసులకు మధ్య జరిగే కథతో థ్రిల్లింగ్‌,యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో ఆద్యంతం అల‌రించేలా రూపొందించారు.

రిలయన్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ , రోహిత్‌ శెట్టి (Rohit Shetty) పిక్చర్స్‌ బ్యానర్స్‌పై సంయుక్తంగా నిర్మించగా సింగం, సూర్యవంశీ, సింబా వంటి సినిమాల‌ను రూపొందించిన‌ రోహిత్‌శెట్టి, మ‌రో డైరెక్ట‌ర్‌ సుశ్వంత్ ప్రకాష్‌తో క‌లిసి దర్శకత్వం చేశారు. ఈ సిరీస్‌లో ఇంకా శ్వేతా తివారి, ముకేష్‌ రిషి, నికితిన్‌ ధీర్‌, రితురాజ్‌ సింగ్‌, లలిత్‌ పరిమో, శరద్ ఖేల్కర్ వంటి భారీ తారాగ‌ణం న‌టించింది. ఇప్ప‌టికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పంద‌న రావ‌డంతో సిరీస్‌పై కూడా అంచ‌నాలు బాగా పెరిగాయి. అయితే ఈ సిరీస్‌లో బాలీవుడ్ స్టార్స్‌ అజయ్‌ దేవ్‌గణ్‌, అక్షయ్‌ కుమార్‌, రణ్‌వీర్‌ సింగ్ లు కూడా గెస్ట్ అప్పియ‌రెన్స్‌లు ఇవ్వ‌నుండ‌డం విశేషం


ఇక క‌థ విష‌యానికి వ‌స్తే.. ప్రారంభ‌మే ఢిల్లీలో కొన్ని ప్ర‌దేశాల్లో స‌డ‌న్‌గా బాంబులు పేలుతాయి. వాటిని ఎవ‌రు పేల్చారు, వారి మోటివేష‌న్ ఏంట‌నేది తెలుసుకోవ‌డానికి పోలీసులు రంగంలోకి దిగుతారు. ఈ క్ర‌మంలో బాంబులు పెట్టిన వారిని ప‌ట్టుకున్నారా లేదా అనే ఇతివృత్తంలో ప్ర‌త్యేకంగా క‌థ సాగుతుంది. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ (Indian Police Force) సిరీస్ మొత్తం విజువ‌ల్స్‌, యాక్ష‌న్ సీన్స్‌ అద్భుతంగా ఉన్న‌ప్ప‌టికీ కాస్త సాగ దీసిన‌ట్లుగా అనిపిస్తుంది. మ‌ధ్య‌లో ఒక‌టి రెండు పాట‌లు కూడా ఉన్నాయి. వివేక్ ఒబెరాయ్ పాత్ర కొన్ని ఎపిసోడ్స్ వ‌ర‌కే ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న క్యారెక్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది.

దాదాపు 4.30 గంట‌ల పాటు సాగే ఈ ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ (Indian Police Force) వెబ్ సిరీస్‌లో ఏడు ఎపిసోడ్స్‌ 1) ఢిల్లీ పోలీస్ రైజింగ్ డే 35 నిమిషాలు, 2) వ‌న్ రాంగ్ కాల్ 48 నిమిషాలు, 3) ది హంట్ 31 నిమిషాలు, 4) ది ఘోస్ట్‌ ఇజ్ బ్యాక్ 49 నిమిషాలు, 5) ది లాస్ట్ 33 నిమిషాలు, 6) ది ట్రూత్ 36 నిమిషాలు, 7) హోం క‌మింగ్ 37 నిమిషాలతో ఉండ‌నున్నాయి. ఇప్పుడు ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో( Prime Video)లో స్ట్రీమింగ్ అవుతుండ‌గా తెలుగు అడియోతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ ఆడియోల్లోను అందుబాటులో ఉంది. సిరీస్‌లో ఎలాంటి మ‌సాలా, బోల్డ్ స‌న్నివేశాలు కూడా లేవు కాబ‌ట్టి ఫ్యామిలీతో క‌లిసి ఈ సిరీస్‌ను ఒక్క‌సారి చూసేయొచ్చు.

Updated Date - Jan 19 , 2024 | 03:56 PM