Shyam Benegal: బ్లాక్ డే.. ముగిసిన సినీ శకం

ABN, Publish Date - Dec 23 , 2024 | 08:20 PM

తెలంగాణ ఆత్మని తెరపై ఆవిష్కరించిన అతికొద్ది గొప్ప డైరెక్టర్లలో ఒకరైన శ్యామ్ బెనెగల్ ఈరోజు సాయంత్రం మృతి చెందారు.

భారతీయ సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. తెలంగాణ ఆత్మని తెరపై ఆవిష్కరించిన అతికొద్ది గొప్ప డైరెక్టర్లలో ఒకరైన శ్యామ్ బెనెగల్ ఈరోజు సాయంత్రం మృతి చెందారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అంకుర్, భూమిక, నిషాంత్, కలుగ్, మంతన్ సహా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. 1934లో డిసెంబర్ 14న హైదరాబాదు తిరుమలగిరిలో జన్మించిన ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే సహా పలు అవార్డులు వరించాయి..


బెనెగల్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చదివారు. 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారాన్ని అందుకున్నారు. 2013లో ఏఎన్ఆర్ జాతీయ అవార్డును తీసుకున్నారు. మొత్తం ఏడుసార్లు శ్యామ్ బెనగల్ జాతీయ అవార్డు అందుకున్నారు.

Updated Date - Dec 23 , 2024 | 09:44 PM