Shreyas Talpade: నోట్లో కాటన్ పెట్టుకోవాల్సి వచ్చింది.. 'పుష్ప 2'
ABN, Publish Date - Dec 07 , 2024 | 06:46 AM
'పుష్ప 2' హిందీ వెర్షన్ కి డబ్బింగ్ చెప్పిన శ్రేయాస్ తల్పాడే బన్నీ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ది రూల్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై రూల్ చేస్తోంది. ‘పుష్ప’ చిత్రంతో తన సత్తా చాటిన అల్లు అర్జున్, ఇప్పుడు ‘పుష్ప 2’తో మరోసారి తన పవర్‌ని బాక్సాఫీస్‌కి పరిచయం చేస్తున్నారు. హిందీలోనూ ఈ చిత్రం మొదటి రోజే రూ. 72 కోట్లు రాబట్టి.. ఇప్పటి వరకు హిందీలో ఫస్ట్ డే కలెక్షన్స్‌లోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలోనే పుష్ప రాజ్ కి హిందీలో డబ్బింగ్ చెప్పిన శ్రేయాస్ తల్పాడే మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో శ్రేయాస్ తల్పాడే మాట్లాడుతూ.. " ఇప్పటి వరకు నేను అల్లు అర్జున్ ని కలవలేదు. పుష్ప ది రైజ్ కి కూడా నేనే డబ్బింగ్ చెప్పాను. ఆ సినిమా భారీ సక్సెస్ కావడంతో భారీ అంచనాల కారణంగా 'పుష్ప 2'కి డబ్బింగ్ చెప్పే సమయాల్లో ఒత్తిడికి గురయ్యాను. బన్నీ గుట్కా నమిలే, స్మోక్ చేసే సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పడానికి తీవ్రంగా కష్టపడ్డాను. నోటిలో కాటన్ పెట్టుకొని డబ్బింగ్ చెప్పాను. ఎదో ఒక రోజు ఆయనను డైరెక్ట్ గా కలవాలని ఉంది" అంటూ చెప్పుకొచ్చారు. గతంలోను తల్పాడే వాయిస్ మాడ్యులేషన్ ని బన్నీ మెచ్చుకున్నారు. దీంతో మరోసారి ఆయన ఫీడ్‌బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాని శ్రేయాస్ అన్నారు.
ఇక శ్రేయాస్ తల్పాడేకి హిందీలో మంచి యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా పేరుంది. ఆయన హిందీతో పాటు మరాఠి చిత్ర పరిశ్రమలో క్రిటికల్ అండ్ కమర్షియల్ సక్సెస్‌లను అందుకున్నారు. ఆయన షారుఖ్ ఓం శాంతి ఓం సినిమాలో పప్పు మాస్టర్ గా నటించి వీపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకున్నారు. గోల్‌మాల్ రిటర్న్స్, వెల్‌కమ్ టు సజ్జన్‌పూర్, గోల్‌మాల్ 3, హౌస్‌ఫుల్ 2 , గోల్‌మాల్ ఎగైన్ వంటి హిట్ చిత్రాలలో నటించారు.