Shreya ghoshal: వైద్యురాలి హత్యాచారంపై శ్రేయ ఘోషల్ కదిలించే పాట
ABN, Publish Date - Oct 21 , 2024 | 09:13 PM
‘గాయపడిన నా శరీరం బాధను ఈ రోజు మీరు వింటున్నారు..’ అంటూ సాగే పాటను శ్రేయా ఉద్వేగభరింతగా ఆలపించారు. ఇలాంటి ఘటనల్లో బాధితులు ఎదుర్కొనే బాధ, ఆవేదనను ఆమె ఈ పాట రూపంలో వినిపించారు శ్రేయా. పాట పాడుతున్న సమయంలో ఎవరూ చప్పట్లు కొట్టొద్దని ఆడియన్స్‌ను శ్రేయా కోరారు.
కొన్నాళ్ల క్రితం పశ్చిమ బెంగాల్‌లో జరిగిన జూనియర్ వైద్యురాలి హత్యాచార (Female Doctor) ఘటన నేపథ్యంలో ఆ సమయంలో జరగాల్సిన గాయని శ్రేయా ఘోషల్ కాన్సర్ట్‌ను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ కాన్సర్ట్‌ను ఆమె నిర్వహించారు. ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటనపై అప్పుడే శ్రేయా ఘోషల్ 9Shreya ghoshal) స్పందించారు. దీని గురించి తెలిశాక తన వెన్నులో వణుకు పుట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది క్రూరమైన చర్య అని.. తనపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు.
అయితే అప్పుడు క్యాన్సిల్ అయిన కాన్సెర్ట్ ‘ఆల్ హార్ట్స్ టూర్’లో (All herats tour) భాగంగా కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై భావోద్వేగ గీతాన్ని ఆలపించారు. ‘గాయపడిన నా శరీరం బాధను ఈ రోజు మీరు వింటున్నారు..’ అంటూ సాగే పాటను శ్రేయా ఉద్వేగభరింతగా ఆలపించారు. ఇలాంటి ఘటనల్లో బాధితులు ఎదుర్కొనే బాధ, ఆవేదనను ఆమె ఈ పాట రూపంలో వినిపించారు శ్రేయా. పాట పాడుతున్న సమయంలో ఎవరూ చప్పట్లు కొట్టొద్దని ఆడియన్స్‌ను శ్రేయా కోరారు. పాట పూర్తయ్యాక స్టేడియం మొత్తం ‘వీ వాంట్ జస్టిస్’ నినాదాలతో హోరెత్తింది. శ్రేయ ప్రోగ్రామ్‌పై ఆమెను ప్రశంసిస్తూ.. తృణముల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కునాల్ ఘోష్ ఓ పోస్ట్ పెట్టారు. ‘ఈ ఘటనపై ఆమె ఎంతో బాధపడ్డారు. కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు మహిళల భద్రతపై గీతాన్ని ఆలపించి అందరి హృదయాలను కదిలించారు. హత్యాచారాల ఘటనలపై నిరసనలు అవసరం’ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై గాయకుడు అర్జిత్ సింగ్ ఓ బెంగాలీ పాటతో నిరసనలకు తన మద్దతు తెలిపారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు.