Shreya ghoshal: వెన్నులో వణుకు పుట్టింది .. కాన్సెర్ట్ క్యాన్సిల్ చేశా
ABN, Publish Date - Sep 01 , 2024 | 03:13 PM
కోల్‌కతా జూనియర్ వైద్యురాలి (Jr Doctor) హత్యాచార ఘటన గురించి తెలిశాక తన వెన్నులో వణుకు పుట్టిందని గాయని శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) ఆవేదన వ్యక్తం చేశారు.
కోల్‌కతా జూనియర్ వైద్యురాలి (Jr Doctor) హత్యాచార ఘటన గురించి తెలిశాక తన వెన్నులో వణుకు పుట్టిందని గాయని శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఆ నగరంలో జరగాల్సిన తన కాన్సర్ట్‌ను వాయిదా వేసుకున్నారు. ఈవిషయాన్ని తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల రక్షణ (Womem safety) కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ‘ఇటీవల కోల్‌కతాలో జరిగిన భయంకరమైన, హేయమైన సంఘటనతో నేను చాలా బాధపడ్డాను. అది నాపై తీవ్ర ప్రభావం చూపింది. అది పూర్తిగా క్రూరమైన చర్య. ఆ విషయం తెలిశాక నా వెన్నులో వణుకు పుట్టింది. సిటీలో సెప్టెంబర్‌లో జరగాల్సిన నా సంగీత విభావరిని వాయిదా వేసుకుంటున్నా. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తాను. ఈ కచేరీ సంగీత ప్రియులకు ఎంతో అవసరం. కానీ దానికంటే మహిళల గౌరవం, వారి భద్రత కోసం నేను ప్రార్థిస్తున్నాను. అందుకే ఈ షోను వాయిదా వేస్తున్నా. నా నిర్ణయాన్ని మీరంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో నిందితుడికి న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.