shah rukh khan: హ్యాపి బర్త్ డే 'కింగ్'.. చావులోనూ అదే కావాలి
ABN, Publish Date - Nov 02 , 2024 | 03:46 PM
అత్యంత పేద కుటుంబం నుండి అత్యంత కఠినాత్మకమైన సినీ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయినా షారుఖ్ ప్రపంచంలోనే అత్యంత ధనికమైన యాక్టర్‌గా ఎదిగారు. కేవలం యాక్టర్‌గానే కాకుండా గొప్ప మనిషిగా, ఫిలాసఫర్‌గా ఆయనకు ఆయనే సాటి. తనదైన సెన్స్ అఫ్ హ్యూమర్, విట్టినెస్తో ప్రపంచ నలుమూలల నుండి కోట్ల అభిమానులను సొంతం చేసుకున్నాడు.
బాలీవుడ్ 'బాద్ షా' షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నేటితో 59 ఏళ్లలో అడుగుపెట్టారు. భారతీయ చిత్ర సీమ ఎప్పటికి గుర్తుండిపోయే సినిమాలని అందించారు షారుఖ్. అత్యంత పేద కుటుంబం నుండి అత్యంత కఠినాత్మకమైన సినీ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయినా షారుఖ్ ప్రపంచంలోనే అత్యంత ధనికమైన యాక్టర్‌గా ఎదిగారు. కేవలం యాక్టర్‌గానే కాకుండా గొప్ప మనిషిగా, ఫిలాసఫర్‌గా ఆయనకు ఆయనే సాటి. తనదైన సెన్స్ అఫ్ హ్యూమర్, విట్టినెస్తో ప్రపంచ నలుమూలల నుండి కోట్ల అభిమానులను సొంతం చేసుకున్నాడు.
ఇటీవల భారత సినీ పరిశమ్రకు ఆయన అందించిన సేవలకు గాను ప్రపంచ ప్రఖ్యాత ‘లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్’ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏదైనా సినిమా సెట్లో యాక్టింగ్ చేస్తూ చనిపోవాలన్నదే తన కోరిక అన్నారు. డైరెక్టర్ కట్ చెప్పినా.. పైకి లేవకూడదన్నారు. ఇక తాను స్టార్‌డమ్‌ను చాలా గౌరవిస్తానని, దానివల్లే ఫ్యాన్స్ ప్రేమ, ఆదరణ, గుర్తింపు, డబ్బు లభించాయని చెప్పారు. ఇక షారుఖ్ సెన్సాఫ్ హ్యూమర్ గురించి ప్రపంచానికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనకు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువని చెప్పిన షారుఖ్.. ప్రస్తుతం జనాలు సెన్సిటివ్ అయ్యారు, కాబట్టి సెన్సాఫ్ హ్యూమర్ లేకపోవడమే బెటర్ అంటూ విట్టినెస్ ప్రదర్శించాడు.
ఇక షారుఖ్‌తో ప్రేమ గురించి భార్య గౌరీ ఖాన్ మాట్లాడుతూ.. "షారుఖ్ 18 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి నన్ను ప్రేమించాడు. కానీ షారుఖ్ ప్రేమను అంగీకరించడానికి చాలా కాలం పట్టింది. ప్రేమ ఓకే అయిన తర్వాత పెళ్లి ఎలా చేసుకోవాలనే దానిపై వారు చాలా ఆలోచన చేసినట్లుగా తెలిపారు. ‘‘మా ఇద్దరి మతాలు వేరు. దీంతో ఇంట్లో వాళ్లు మా ప్రేమను ఒప్పుకోలేదు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. ఆ తర్వాత షారుఖ్‌ని మా వాళ్లకి అభినవ్‌గా పరిచయం చేశాను. అభినవ్ అనగానే హిందువు అనుకుంటారని అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది మాది చాలా సిల్లీ మరియు చైల్డిష్ ఆలోచన అని. పెళ్లి తర్వాత నేను మతం మార్చుకుంటానని మా వాళ్లంతా అనుకున్నారు కానీ.. నేను మతం మార్చుకోలేదు. నా మతం మార్చుకోవాలని నాపై షారుఖ్ ఎప్పుడూ ఒత్తిడి తీసుకురాలేదు’’ అని గౌరీ ఖాన్ తెలిపింది.