40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dating: సీరత్ కపూర్ డేటింగ్ చేస్తున్నది అతన్నేనా...

ABN, Publish Date - Jan 17 , 2024 | 06:36 PM

'రన్ రాజా రన్' సినిమాతో పరిచయమై ఆమధ్య సిద్ధూ జొన్నలగడ్డ తో 'కృష్ణ అండ్ హిజ్ లీల' అనే సినిమాలో కూడా నటించి, తను గ్లామర్ పాత్రలకి కూడా సిద్ధం అని చెప్పిన సీరత్ కపూర్ ఇప్పుడు బాలీవుడ్ కి చెందిన ఒక నటీమణి సోదరుడితో డేటింగ్ చేస్తోందని వార్త...

Seerat Kapoor is dating Bollywood actress' brother

'రన్ రాజా రన్' అనే తెలుగు సినిమాతో పరిచయమైన సీరత్ కపూర్ తెలుసు కదా. ఆ సినిమా పెద్ద విజయం సాధించినా, సీరత్ తరువాత చాలా తక్కువ సినిమాలు చేశారు, కానీ ఇప్పుడు నాలుగైదు తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ లతో చాలా బిజీగా వున్నారు. సినిమాలు కాకుండా, సీరత్ ఇప్పుడు వార్తల్లో వున్నారు, ఆమె ఒక అబ్బాయితో డేటింగ్ లో వుంది అనే వార్త అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో కూడా హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఎవరా అబ్బాయి, అతడినే పెళ్లి కూడా చేసుకుంటుందా అనే వార్తలు కూడా చాలా తిరుగుతున్నాయి. (Seerat Kapoor is dating Bollywood actress brother)

కొత్త సంవత్సరం రోజు సీరత్ కపూర్ థాయిలాండ్ బీచ్ లో తన స్నేహితులతో సెలెబ్రేట్ చేసుకుంది, అప్పుడు కొన్ని ఫోటోస్ ని కూడా తన సామజిక మాధ్యమంలో షేర్ చేసింది. అందులో బాలీవుడ్ కి చెందిన, రకుల్ ప్రీత్, ఆమె కాబోయే భర్త జాకీ భగ్నానీ, భూమి పెడ్నేకర్, అలాగే టాలీవుడ్ కి చెందిన మంచు లక్ష్మి, ప్రగ్య జైస్వాల్ కూడా వున్నారు. అయితే ఇదే పార్టీలో సీరత్ కపూర్ ఇంకొక వ్యక్తితో బాగా దగ్గరగా వున్న ఫోటోని కూడా పెట్టింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరా అని చూస్తే, అతను మరెవరో కాదు, రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్.

అమన్ ప్రీత్ తో వున్న సీరత్ కపూర్ ఫోటో చూసి, వాళ్లిద్దరూ ఇప్పుడు డేటింగ్ లో వున్నారు అనే వార్త ఒక్కసారిగా వైరల్ అయింది. అతను రకుల్ సోదరుడు అవటం, వాళ్లిద్దరూ డేటింగ్ లో వున్నారని తెలిసే, రకుల్ ప్రీత్ సింగ్ ఆ ఆ పార్టీకి సీరత్ ని ఆహ్వానించింది అని కూఆ వార్త వచ్చింది. అందుకే రకుల్ తన బాలీవుడ్ ప్రస్థానం 10 ఏళ్ళు అయిన సందర్భంగా ఒక నోట్ షేర్ చేస్తే, దానికి చాలా భావోద్వేగంతో కూడిన సమాధానము పెట్టింది సీరత్ కపూర్. అయితే వాళ్ళ బంధం ఇంకా ముందు ముందు బాగా బలపడాలని అటు సీరత్, ఇటు రకుల్ కుటుంబ సభ్యులు అనుకుంటున్నటుగా తెలిసింది. (Rakul Preet Singh brother Aman Preet)

ఆసక్తికరం ఏంటంటే ఈ విషయం గురించి అటు అమన్ ప్రీత్ కానీ, ఇటు సీరత్ కానీ వాళ్ళ బంధం గురించి మాట్లాడకపోవడం. రకుల్ ప్రీత్ తన వివాహం ఫిబ్రవరిలో తన ప్రియుడు జాకీ భగ్నానీ తో ఉంటుంది అని అంటున్నారు, ఆ తరువాత సీరత్, అమన్ ప్రీత్ గురించి ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం వుంది అని కూడా ఒక వార్త నడుస్తోంది.

ఇక సీరత్ పని విషయానికి వస్తే, ఆమె 'భామాకలాపం 2' లో ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న 'ఆకాశం దాటి వస్తావా', మహి వి రాఘవ్ నిర్మించిన వెబ్ సిరీస్ 'సేవ్ ది టైగర్స్ 2' రెండో సీజన్లో కీలక పాత్ర పోషిస్తోంది. నరేష్ అగస్త్య-జెడి చక్రవర్తి కాంబినేషన్ లో వస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్‌ లో కూడా వుంది.

Updated Date - Jan 17 , 2024 | 06:36 PM