Biggboss 2 Ott: సీజన్‌ 3 విజేతగా దిక్కులు చూడకు రామయ్య హీరోయిన్

ABN, Publish Date - Aug 03 , 2024 | 10:55 AM

హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌ 3 (Biggboss hindi season 3) పూర్తయింది. సీజన్ విజేతగా నటి సనా మక్బుల్‌ (Heroine Sana makbul) నిలిచారు. సనాకు, నేజీకు మధ్య చివరి వరకు పోటీ నెలకొంది.

హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌ 3 (Biggboss hindi season 3) పూర్తయింది. సీజన్ విజేతగా నటి సనా మక్బుల్‌ (Heroine Sana makbul) నిలిచారు. సనాకు, నేజీకు మధ్య చివరి వరకు పోటీ నెలకొంది. చివరకు సనానే విజేత అంటూ హోస్ట్‌ అనిల్‌ కపూర్‌ ప్రకటించారు. జూన్‌ 21న ప్రారంభమైన ఈ సీజన్‌ ఆగస్టు 2తో పూర్తయింది. గతంలో కరణ్‌జోహర్‌, సల్మాన్‌ఖాన్‌ వ్యాఖ్యతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమం మూడో సీజన్‌కు అనిల్‌ కపూర్‌ (Anil kapoor) హోస్ట్‌గా ఉన్నారు. ఫైనల్‌ ఎపిసోడ్‌లో రాజ్‌కుమార్‌ రావు, శ్రద్దాకపూర్‌ హాజరై సందడి చేశారు. పలువురు కంటెస్టెంట్‌లు ఎలిమినేషన్‌ ప్రక్రియ అనంతరం ఫైనల్‌గా సనా మక్బుల్‌ విజేతగా నిలిచారు. టైటిల్‌తో పాటు రూ.25 లక్షల బహుమతిని గెలుచుకున్నారు. ముంబయిలో పుట్టిన సనా మోడలింగ్‌ ద్వారా కెరీర్‌ను  ప్రారంభించారు. సీరియళ్లు, సినిమాలు చేసున్నారు. తెలుగులో ‘దిక్కులు చూడకు రామయ్య’లో ఆమె హీరోయినగా మెప్పించారు. (Biggboss ott season 3)


గత సీజన్‌లతో పోలిస్తే తాజా సీజన్‌ ఎక్కువగా వార్తల్లో నిలిచింది. కృతిక, అర్మాన్‌ మాలిక్‌ జంట హౌస్‌లో అసభ్యకరంగా ప్రవర్తించిందని, ముద్దులు, హగ్గులు హద్దు దాటాయని, కుటుంబ సభ్యులంతా కలిసి చూసే షో అని ప్రమోషన్  చేసి ఇలాంటి అసభ్యకర కంటెంట్‌ను ప్రసారం చేసున్నారని ఈ షోపై ముంబయి నగర పోలీస్‌ కమిషనర్‌కు శివసేన అధికార ప్రతినిధి మనీషా కయాండే ఫిర్యాదు చేశారు. దీనిపై స్వయంగా ‘జియో సినిమా’ వివరణ ఇచ్చింది. తాము ప్రసారం చేేస కంటెంట్‌ ఏదైనా.. నాణ్యత, మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటుందని తెలిపింది. జియో సినిమాలో ప్రసారమయ్యే ఓటీటీ బిగ్‌బాస్‌లో అలాంటి అశ్లీల కంటెంట్‌ లేదని క్లారిటీ ఇచ్చింది.  

Updated Date - Aug 03 , 2024 | 11:32 AM