Salman Khan Vs Aamir Khan: అమీర్ ఖాన్‌ని టార్గెట్ చేసిన సల్మాన్.. దంగల్

ABN, Publish Date - Nov 19 , 2024 | 02:54 PM

పర్ఫెక్ట్ హీరోగా పేరు పొందిన 'అమీర్ ఖాన్'పై 'సల్మాన్ ఖాన్' బహిరంగంగానే తన ద్వేషాన్ని ప్రదర్శించారు. ఇంతకీ ఏమైందంటే..

బాలీవుడ్ కా భాయ్ 'సల్మాన్ ఖాన్' అభిమానులతో పాటు హేటర్స్ కూడా ఎక్కువే. కానీ, భాయ్ హేటర్స్‌ని మాత్రం పట్టించుకోకుండా కొన్ని దశాబ్దాల నుండి బాలీవుడ్‌లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఆయనకు సహచర నటీనటులతో కూడా చాలా మంచి సంబంధాలు కొనసాగిస్తారు. మరికొందరు నటులు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసిన సల్మాన్ పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించరు. అయితే పర్ఫెక్ట్ హీరోగా పేరు పొందిన 'అమీర్ ఖాన్'పై ఆయన బహిరంగంగానే తన ద్వేషాన్ని ప్రదర్శించారు. ఇంతకీ ఏమైందంటే..


2016లో రెజ్లింగ్ ఆధారంగా సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' సినిమా రిలీజై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. రూ. 90 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 623 కోట్ల వసూళ్లను కైవసం చేసుకుంది. అయితే అదే ఏడాది రెజ్లింగ్ ఆధారంగా నితేశ్ తివారి దర్శకత్వంలో 'అమీర్ ఖాన్' ప్రధాన పాత్రలో నటించిన 'దంగల్' సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఏకంగా కొత్త చరిత్రనే సృష్టించింది. రూ. 70 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 2000 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి సరికొత్త చరిత్ర రికార్డ్ చేసింది. ఈ నేపథ్యంలోనే సల్మాన్ ఖాన్ అమీర్ ని టార్గెట్ చేస్తూ ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు.


సల్మాన్ పోస్ట్ రాస్తూ.. "నా ఫ్యామిలీ ఈరోజు అమీర్ ఖాన్ 'దంగల్' సినిమా చూసింది. వారికి నా 'సుల్తాన్' సినిమా కంటే ఎక్కువగా నచ్చింది. పర్సనల్‌గా నువ్వంటే నాకు అభిమానమున్న వృత్తిపరంగా 'ఐ హేట్ యూ అమీర్' అంటూ" సరదాగా పోస్ట్ చేశారు. దీంతో అప్పట్లో ఈ పోస్ట్ తెగ వైరల్ అయ్యింది. సరిగ్గా ఈ ఘటన జరిగి ఎనిమిదేళ్లు గడుస్తుండటంతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Updated Date - Nov 19 , 2024 | 02:54 PM