Salman Khan: రావాలి అనిపించడం లేదు.. ఫ్రస్ట్రేషన్‌లో సల్మాన్ ఏమన్నాడో తెలుసా
ABN, Publish Date - Oct 20 , 2024 | 01:40 PM
చర్చలకు ఫుల్ స్టాప్ పెడుతూ భారీ సెక్యూరిటీ మధ్యన సల్మాన్ వరుసగా రెండు రోజులు బిగ్‌బాస్ షూట్‌కి హాజరయ్యారు. ఈ షోలో ఆయన మాట్లాడుతూ.. షోకి రావాలని లేదని తెలిపాడు. ఒక క్రమంలో ఫ్రస్టేట్ అవుతూ.. షో నుంచి నిష్క్రమించాడు.
సల్మాన్ ఆప్త మిత్రుడు, ఎన్సీపీ లీడర్ బాబా సిద్దిఖీ హత్యానంతరం సల్మాన్ ఖాన్‌కి బెదిరింపులు పెరిగిపోయాయి. ఈ హత్యను మేమె చేశాం.. నెక్స్ట్ టార్గెట్ సల్మానే అంటూ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన వై + సెక్యూరిటీని పోలీసులు మరింత పటిష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన బిగ్‌బాస్ షోకి అటెండ్ అవుతారా అనే చర్చ కూడా ఊపందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ చర్చలకు ఫుల్ స్టాప్ పెడుతూ భారీ సెక్యూరిటీ మధ్యన సల్మాన్ వరుసగా రెండు రోజులు బిగ్‌బాస్ షూట్‌కి హాజరయ్యారు. ఈ షోలో ఆయన మాట్లాడుతూ.. షోకి రావాలని లేదని తెలిపాడు. ఒక క్రమంలో ఫ్రస్టేట్ అవుతూ.. షో నుంచి నిష్క్రమించాడు.
తాజాగా హిందీ బిగ్‌బాస్‌లో జరిగిన 'వీకెండ్ కా వార్' ఎపిసోడ్ లో హోస్ట్ సల్మాన్ ఖాన్ కంటెస్టెంట్లతో మాట్లాడుతూ ఇటీవల తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల వల్ల తన మానసిక పరిస్థితి ఎలా మారిందో విచారించే ప్రయత్నం చేశాడు. ముందుగా శిల్ప శిరోద్కర్‌తో మాట్లాడుతూ.. "నహీ ఆనా థా ముజే యహా పర్ బట్ యే ఏక్ కమిట్‌మెంట్ హై. ఇసిలియే మే యహా పర్ ఆయా హు. ఏక్ మేరా కామ్ హై, మై వోహ్ కామ్ కర్నే ఆయా హు. ముజే కిసీ సే నహీ మిల్నా. ముజే ఆప్ లోగో సే భీ నహీ మిల్నా (నేను రావడానికి ఇష్టపడలేదు కానీ నిబద్ధత ఉన్నందున నేను రావాల్సి వచ్చింది. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. ఇది నా పని, నేను ఇక్కడ పని చేస్తున్నాను. నేను ఎవరితోనూ కలవొద్దు అనుకున్న. మీ అందర్నీకూడా కలవొద్దు అనుకున్న) కానీ నేను ఈ పని చేయడానికి కట్టుబడి ఉన్నాను కాబట్టి రావాల్సి వచ్చిందని" కష్ట సమయాల్లో ఎలా స్ట్రాంగ్ గా ఉండాలో చెప్పాడు.
ఇంకో విషయంపై మాట్లాడుతూ.. "మేరే ఊపర్ భీ బోహోత్ సారే లాల్‌చన్ లగాయే గయే హై. (నేను కూడా చాలా విషయాల్లో ఆరోపణలు ఎదుర్కొన్నాను) కానీ నా తల్లిదండ్రులు ఏమి అనుభవిస్తారో నాకు తెలుసు" అంటూ సల్మాన్ తనపై ఉన్న వ్యక్తిగత, వృత్తిపర ఆరోపణలు అడ్రస్ చేశారు. మరోవైపు హౌస్‌లో యాక్టర్‌ల వ్యక్తిగత జీవితాలపై కామెంట్ చేసిన కంటెస్టెంట్‌ని ఉద్దేశించి.. సల్మాన్ ప్రస్టేట్ అయ్యాడు. 'ఖుదా కసమ్ కి యార్' నా జీవితంలో నేను ఏం చేస్తున్న అంటూ షో నుండి వెళ్లిపోయాడు.