Salman Khan: ఆ ఇబ్బంది ఎందుకు.. అభిమానులు చర్చ
ABN, Publish Date - Aug 30 , 2024 | 05:49 PM
ముంబైలో పర్యావరణ హిత వినాయక చవితి అందరూ జరుపుకోవాలనే ఉద్దేశంతో ‘బచ్చే బోలే మోరియా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ అతిథి హాజరయ్యారు.
ముంబైలో పర్యావరణ హిత వినాయక చవితి అందరూ జరుపుకోవాలనే ఉద్దేశంతో ‘బచ్చే బోలే మోరియా’ (Bache bole Moria) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ (Salman khan) అతిథి హాజరయ్యారు. వేదికపై ఆయన కంఫర్ట్‌గా కూర్చొలేకపోయారు. పదే పదే కదులుతూ ఇబ్బంది పడ్డాడు. దీంతో ఫ్యాన్ కాస్త కంగారు పడ్డారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆయనకు ఏం జరిగింది ? అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ప్రస్తుతం సల్మాన్ తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్ ‘సికిందర్’ (Sikandar) సినిమా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్‌గా షూటింగ్ టైంలో సల్మాన్ గాయపడ్డారు. పక్కటెముకలకు గాయమైందని తెలిసింది. కూర్చునప్పుడు ఓ వైపు నొప్పి వేధిస్తున్నా సరే ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఆ నొప్పితో కూడా అయన వేదిక పై డాన్స్ చేశారు. ఈ విషయాన్నే కార్యక్రమాన్ని నిర్వహించిన అమృత ఫడ్నవీస్ తెలిపారు. అయితే సల్మాన్ ఖాన్ ఇలా కుర్చీలో ఇబ్బంది పడుతున్న వీడియోని చూసి అభిమానులు కంగారు పడ్డారు. కానీ అది పెద్ద సమస్య కాదని, కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందని చెబుతున్నారు. సికిందర్ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా విడుదల కానుంది.