Saif Ali Khan: 'ఆదిపురుష్’ ఫలితంపై సైఫ్ ఏమన్నారంటే..!
ABN, Publish Date - Feb 08 , 2024 | 06:11 PM
ప్రభాస్ (Prabhas) హీరోగా ఓంరౌత్ (om Raut) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush) . ఇందులో సీతగా కృతీసనన్ నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన ఫలితం దక్కలేదు.
ప్రభాస్ (Prabhas) హీరోగా ఓంరౌత్ (om Raut) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush) . ఇందులో సీతగా కృతీసనన్ నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన ఫలితం దక్కలేదు. ఇందులో లంకేశ్ పాత్రలో కనిపించిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తాజాగా ఈ సినిమా ఫలితంపై ఓ మీడియాతో మాట్లాడారు.
‘నేనెప్పుడూ స్టార్ హీరోనని, పెద్ద హీరోనని భావించలేదు. ఎప్పటికీ నాకు ఆ భావన ఉండదు. నా తల్లిదండ్రులు కూడా సినిమా పరిశ్రమకు చెందినవారే అయినప్పటికీ ఎప్పుడూ సాధారణ జీవితాన్నే గడిపారు. జీవితంలోమనం దృష్టి పెట్టాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. నేను వాస్తవంలో బతకాలని కోరుకుంటాను. ఓటమి గురించి ఏ రోజు భయపడలేదు. ఉదాహరణకు ‘ఆదిపురుష్’ సినిమానే తీసుకుంటే రిస్కు చేశారని అందరూ అన్నారు. ఎంతోమంది విమర్శించారు. కొత్తగా ప్రయత్నించినపుడు హిట్ కాకపోయినా అధైౖర్యపడకూడదు. దురదృష్టం కొద్దీ అది విజయం సాధించలేకపోయింది. తర్వాత సినిమాలో రెట్టింపు ఉత్సాహంతో అలరించాలని పని చేయాలి. నేను అదే చేశాను’ అన్నారు.