Rishab Shetty: ఆ పాత్రకు ప్రాణం పోయడానికి రెడీగా..
ABN, Publish Date - Dec 06 , 2024 | 01:53 PM
‘ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో నటించే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఆయనకు నేను అభిమానిని. ఇలాంటి బయోపిక్ అవకాశాలు అరుదుగా వస్తాయి.
'కాంతార’ ఫేం రిషబ్ శెట్టి (Chhatrapati Shivaji Maharaj) ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’. ఇటీవల ఈ సినిమాను ప్రకటిస్తూ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా (Rishab Shetty) గురించి రిషబ్ ఓ మీడియాతో మాట్లాడారు. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో నటించే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఆయనకు నేను అభిమానిని. ఇలాంటి బయోపిక్ అవకాశాలు అరుదుగా వస్తాయి. ఆయన పాత్రకు ప్రాణం పోయడానికి రెడీగా ఉన్నాను. ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. నా వద్దకు వచ్చి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చేశాను. శివాజీ చరిత్రను నేటి తరానికి చెప్పడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అద్భుతమైన సినిమాటిక్ అనుభవం కోసమే కాదు.. శివాజీ గురించి ఇప్పటివరకు తెలియని కథలను కూడా తెలుసుకోవడానికి రెడీగా ఉండండి’’ అని ఆయన అన్నారు. (The Pride Of Bharat - Chhatrapati Shivaji Maharaj)
‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ చిత్రాన్ని హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో సందీప్ సింగ్ తెరకెక్కించనున్నారు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి, మొఘల్ సామ్రాజ్యాన్ని సవాలు విసిరిన యోధుడి కథ’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2027 జనవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం రిషబ్ ‘జై హనుమాన్’తో పాటు కాంతార ప్రీక్వెల్‌తోనూ బిజీగా ఉన్నారు.