Rishab Shetty: ఛత్రపతి శివాజీగా రిషబ్.. గర్వం.. గౌరవం..
ABN, Publish Date - Dec 03 , 2024 | 02:43 PM
నటుడిగా, దర్శకుడిగా 'కాంతారా’ (Kanthara) చిత్రంతో అలరించి నేషనల్ అవార్డ్ అందుకున్న రిషబ్ శెట్టి తాజాగా మరో గొప్ప పాత్రలో అలరించడానికి సిద్ధమవుతున్నారు.
నటుడిగా, దర్శకుడిగా 'కాంతారా’ (Kanthara) చిత్రంతో అలరించి నేషనల్ అవార్డ్ అందుకున్న రిషబ్ శెట్టి తాజాగా మరో గొప్ప పాత్రలో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో ఆయన ప్రధాన పాత్రలో నటించనున్నారు. దీనిపై రిషబ్ స్పందించారు. 'ఛత్రపతి శివాజీ జీవితానికి సంబంధించి ఎన్నో విశేషాలతో సందీప్ సింగ్ (Samdeep singh)తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ (Chhatrapati Shivaji Maharaj) 2027 జనవరి 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనిపై రిషబ్ మాట్లాడుతూ.. ‘ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో నటిస్తున్నందుకు గౌరవంగా, గర్వంగా ఉంది. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన శక్తిమంతమైన వ్యక్తి చరిత్ర. ఇలాంటి యోధుడి చరిత్రను సినిమాగా తీసుకురావాలనేది గొప్ప ఆలోచన. ఈ యాక్షన్ డ్రామా కోసం సిద్థంగా ఉండండి. అద్భుతమైన సినిమాటిక్ అనుభవం కోసమే కాదు.. శివాజీ గురించి ఇప్పటివరకు తెలియని కథలను కూడా తెలుసుకోవడానికి రెడీగా ఉండండి’’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అవుతోంది, రిషబ్ సినిమాల ఎంపికపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ‘కాంతార’తో తన ప్రతిభను ప్రపంచానికి చెప్పిన ఈ హీరో భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టించేందుకు సిద్థమవుతున్నారు అని అనుకుంటున్నారు. ‘జై హనుమాన్’ సినిమాలో రిషబ్ హనుమంతుడిగా కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ సీక్వెల్ ‘హనుమాన్’కి మించి ఉంటుందని.. హనుమంతుడి పాత్రకు అధిక ప్రాధాన్యత ఉంటుందని దర్శకుడు చెప్పడంతో రిషబ్ పాత్ర గురించి చర్చ మొదలైంది. దీంతోపాటు ‘కాంతార’ ప్రీక్వెల్‌తోనూ రిషబ్ శెట్టి బిజీగా ఉన్నారు.