Remo D'Souza: బాలీవుడ్ డాన్స్ కొరియోగ్రాఫర్‌ఫై కేసు నమోదు..
ABN, Publish Date - Oct 19 , 2024 | 09:29 PM
బాలీవుడ్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజాపై కేసు నమోదైంది. యన సతీమణి లిజెల్లేతో పాటు మరో ఐదుగురు వ్యక్తులు తనని మోసం చేసి డబ్బులు కాజేశారని పేర్కొంటూ
బాలీవుడ్ కొరియోగ్రాఫర్ (dance choreographer) రెమో డిసౌజాపై కేసు నమోదైంది(Remo D Souza). ఆయన సతీమణి లిజెల్లేతో పాటు మరో ఐదుగురు వ్యక్తులు తనని మోసం చేసి డబ్బులు కాజేశారని పేర్కొంటూ యువ డ్యాన్సర్ థానే పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు మేరకు రెమోతోపాటు మిగిలిన వ్యక్తులపై ఫోర్జరీ, చీటింగ్ కేసు నమోదు చేశారు. గతంలో తన బృందం ఒక టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొని.. విజయం సాధించిందని ఆ డ్యాన్సర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఈ టీమ్ తమదేనని చెబుతూ రెమోతోపాటు మిగిలిన వారు 2018-24 మధ్య రూ.11 కోట్లు పొందారని ఆరోపించాడు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2009 నుంచి వివిధ డ్యాన్స్ రియాల్టీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు రెమో. అంతేకాదు ‘రోడ్’, ‘సాథియా’, ‘ముంబయి మ్యాట్నీ’, ‘ధూమ్’, ‘క్యాష్’, ‘డార్లింగ్’, ‘క్రిష్ 3’, ‘బాజీరావ్ మస్తానీ’, ‘రేస్ 3’ వంటి చిత్రాల్లోని పలు పాటలకు ఆయన డ్యాన్స్ మాస్టర్‌గా వర్క్ చేశారు. ‘ఏబీసీడీ’, ‘ఏబీసీడీ 2’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.