Raveena Tandon: ఫేక్ వీడియోతో తప్పుడు ప్రచారం.. రవీనా ఫైర్
ABN, Publish Date - Jun 15 , 2024 | 03:56 PM
బాలీవుడ్ నటి రవీనా టాండన్ (Raveena Tondon) ఓ వ్యక్తిపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా (Defamation notice) వేశారు. ఇటీవల ఆమెకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ నటి రవీనా టాండన్ (Raveena Tondon) ఓ వ్యక్తిపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా (Defamation notice) వేశారు. ఇటీవల ఆమెకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆమె ప్రయాణిస్తున్న కారు ముగ్గురు మహిళలను ఢీకొట్టిందని.. వారు గాయపడినట్టు కొందరు పేర్కొన్నారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి.. ఆ సమయంలో రవీనా మద్యం తాగి ఉన్నారని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఆ మహిళలతో ఆమె గొడవకు దిగినట్లు అతను పేర్కొన్నారు. తనకు సంబంధించిన ఫేక్ వీడియో పోస్ట్ చేసి, తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తూ నోటీసులు పంపారు.
రవీనా తరఫు న్యాయవాది సనా ఖాన్ ఈ విషయంపై మాట్లాడుతూ..‘ఇలాంటి ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేసి ఉద్దేశపూర్వకంగానే రవీనా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. ఆమె పేరును ఉపయోగించుకొని కొందరు పబ్లిసిటీ పొందాలని చూస్తున్నారు. ఈ విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం’ అని అన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు స్పందించారు. రవీనా, ఆమె డ్రైవర్ ఎవరూ మద్యం తీసుకోలేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ను విడుదల చేశారు. పోలీసులు విడుదల చేసిన ేస్టట్‌మెంట్ ఆధారంగా రవీనా ఆ వ్యక్తిపై పరువు నష్టం దావా వేశారు.