మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rashmika Mandanna: మరో భారీ బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌.. ఎవరితో అంటే..!

ABN, Publish Date - May 09 , 2024 | 11:17 AM

బాలీవుడ్‌లో 'యానిమల్‌' చిత్రంతో  సూపర్‌హిట్‌ అందుకున్న నేషనల్‌ క్రష్‌ రష్మిక ఇప్పుడు మరో భారీ ఆఫర్‌ అందుకుంది. అభిమానులు ఎప్పటి నుంచో  రష్మికను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం దొరికింది.

బాలీవుడ్‌లో 'యానిమల్‌' చిత్రంతో  సూపర్‌హిట్‌ అందుకున్న నేషనల్‌ క్రష్‌ రష్మిక (Rashmika mandanna)ఇప్పుడు మరో భారీ ఆఫర్‌ అందుకుంది. అభిమానులు ఎప్పటి నుంచో  రష్మికను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం దొరికింది. తాజాగా ఆమె బాలీవుడ్‌లో పెద్ద ప్రాజెక్ట్‌కి సైన్  చేసింది. సల్మాన్ ఖాన్ (Salman khan) హీరోగా ఎ.ఆర్‌.మురుగదాస్‌ (A R murugadoss) దర్శకత్వంలో 'సికిందర్‌’ 9Sikindar)చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే! ఇటీవల ఈ చిత్రాన్ని సల్మాన్, మురుగదాస్‌, సాజిద్‌ నదియావాలా అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడీ చిత్రంలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా కథానాయికగా నటించనుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది.

"నా తదుపరి చిత్రం ఏంటని చాలాకాలంగా సినీ ప్రియులు. అభిమానులు అడుగుతున్నారు. దానికి ఇదే నా సర్‌ప్రైజ్‌. 'సికిందర్‌' చిత్రంతో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. సల్మాన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం కోసం ఎక్సైటింగ్ గా  ఎదురుచుస్తున్నా. 2025 ఈద్‌కి ఈ చిత్రం విడుదల కానుంది" ట్వీట్ చేసారు రష్మిక. ప్రస్తుతం ఆమె వరుస చిత్రాలతో బిజీగా ఉంది. పుష్ప-2, రెయిన బో, ది గర్ల్‌ఫ్రెండ్‌, చావా, కుబేర చిత్రాల్లో నటిస్తోంది. 

Read More: Cinema News, Tollywood, Bollywood

Updated Date - May 09 , 2024 | 11:22 AM