Dhoom 4: ధూమ్ 4లో మోస్ట్ వైలెంట్  పాన్  ఇండియా హీరో

ABN, Publish Date - Sep 28 , 2024 | 02:27 PM

దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత నిర్మాత ఆదిత్య చోప్రా దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్యతో కలిసి అద్భుతమైన కథ‌ను పకడ్బందీగా ప్లాన్ చేశాడు. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద కనిపించని విజువల్స్‌ భారీ బడ్జెట్‌‌తో సినిమా ప్లాన్ చేశారు. దీంతో మెయిన్ లీడ్ ఎవరు చేస్తారని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బాహుబలి, కేజీఎఫ్‌లతో సౌత్‌లో సీక్వెల్‌ల్లా ట్రెండ్ పుంజుకుంది కానీ బాలీవుడ్‌లో ఆ ట్రెండ్ ఎప్పుడో మొదలైంది. 2003, 2004లోనే క్రిష్, ధూమ్ Dhoom) సిరీస్‌లు ప్రారంభించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ధూమ్ సినిమా‌లో అభిషేక్ హీరోగా జాన్ అబ్రహాం విలన్‌గా కనిపించిన.. ఆ సినిమాతో జాన్ అబ్రహాం సంపాదించుకున్న క్రేజ్ చూసి మేకర్సే షాక్ అయ్యారు. ఆ తర్వాత 'ధూమ్ 2'లో (Dhoom 2)హృతిక్ రోషన్‌ని విలన్‌గా పరిచయం చేసి అద్భుతమైన ఫలితాలు రాబట్టారు. ఇక మూడో పార్ట్‌లో ఏకంగా అమీర్ ఖాన్‌ని దించి కమర్షియల్ హిట్ సంపాదించారు. అయితే ఈ ఫ్రాంచైజీలో నాలుగో సినిమాని తెరకెక్కించేందుకు నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ సిద్ధమవుతోంది. దీంతో ఈ సారి ప్రధాన పాత్రలో ఎవర్ని కాస్ట్ చేస్తారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ ఫ్రాంచైజీలు మొదటి రెండు సినిమాలకి కథనందించి మూడో సినిమాని  డైరెక్ట్ చేసిన విజయ్ కృష్ణ ఆచార్య పార్ట్ 4 కోసం పటిష్టమైన కథను సిద్ధం చేశారట. దీంతో ఈ ఏడాది ఎనిమల్ సినిమాతో ప్యాన్ ఇండియా బాక్సాపీస్‌ని షేక్ చేసిన రణ్‌బీర్ కపూర్‌ని లీడ్ రోల్‌లో లాక్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రామాయణం, బ్రహ్మాస్త్ర 2, లవ్ అండ్ వార్ సినిమాలతో  బిజీగా ఉన్న రణ్‌బీర్ ఇంకా యానిమల్ పార్క్ సినిమా కూడా చేయాల్సింది. అయితే ఈ హీరో దాదాపు ధూమ్ ఫ్రాంచైజీ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా క్యారెక్టర్లను అలానే కంటిన్యూ చేయనున్నారు. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద కనిపించని విజువల్స్‌తో భారీ బడ్జెట్‌లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. 2025 లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

Devara Review: తారక్ నటించిన 'దేవర' ఎలా ఉందంటే


2013లో రిలీజైన ధూమ్‌లో అమీర్ ఖాన్ డ్యూయల్ రోల్‌లో కనిపించాడు. ధూమ్ సిరీస్‌లోని ఇతర సినిమాలకంటే ఎక్కువ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ సినిమా కమర్షియల్‌గా హిట్టైనా అనుకున్నంతా హైప్‌ని మాత్రం రీచ్ కాలేకపోయింది. స్టోరీ పరంగా కూడా క్రిటిక్స్ ఈ సినిమాకి మైనస్ మార్క్‌లు వేశారు. దీంతో దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత  నిర్మాత ఆదిత్య చోప్రా దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్యతో కలిసి అద్భుతమైన కథ‌ను పకడ్బందీగా ప్లాన్ చేశాడంట.

మరిన్ని సినిమా వార్తలకు క్లిక్ చేయండి

Updated Date - Sep 28 , 2024 | 02:38 PM