IFFM 2024: ప్రతిభకు పట్టం.. అక్కడ కూడా బాలీవుడ్‌దే పైచేయి
ABN, Publish Date - Aug 17 , 2024 | 03:11 PM
ఆస్ట్రేలియాలో మన జాతీయజెండాను ఎగురవేశారు గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ 9Ram Charan). అక్కడ జరుగుతున్న ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (ఐఎఫ్‌ఎఫ్‌ఎం IFFM 2024)’ వేడుకకు చరణ్ అతిథిగా హాజరైన ఆయన జెండాను ఎగురవేశారు.
ఆస్ట్రేలియాలో మన జాతీయజెండాను ఎగురవేశారు గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ 9Ram Charan). అక్కడ జరుగుతున్న ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (ఐఎఫ్‌ఎఫ్‌ఎం IFFM 2024)’ వేడుకకు చరణ్ అతిథిగా హాజరైన ఆయన జెండాను ఎగురవేశారు. చిత్ర పరిశ్రమ ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (ఐఎఫ్‌ఎఫ్‌ఎం)లో జరిగాయి. ఆగస్టు 15 నుంచి 25 వరకు జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాతీయ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులను, దర్శకులను సత్కరించనున్నారు. 2024 సంవత్సరానికి సంబంధించిన అవార్డుల్ని ఐ.ఎఫ్.ఎఫ్.ఎం ఈ వేదికపై అందించింది. ఈ అవార్డుల్లో ‘12th ఫెయిల్’ (12th Fail) రెండు పురస్కారాలను అందుకొంది.
'చందు ఛాంపియన్’కు (Champion Chandu) గాను ఉత్తమ నటుడిగా కార్తీక్ ఆర్యన్ అవార్డును సొంతం చేసుకున్నారు. కిరణ్‌రావు ‘లాపతా లేడీస్’ (Lapatha ladies) ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకుంది. ఆస్ట్రేలియాలో జరుగుతోన్న ఈ ఈవెంట్‌లో హీరో రామ్‌చరణ్ ‘ఆర్ట్ అండ్ కల్చరల్ బ్రాండ్ అంబాసిడర్’గా అవార్డును అందుకున్నారు. ప్రత్యేక ఆహ్వానం మేరకు ఈ వేడుక కోసం అక్కడికి వెళ్లిన చరణ్ ఆస్ట్రేలియాలో మన జాతీయజెండాను ఎగురవేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అవార్డులు అందుకున్న విజేతలు
ఉత్తమ నటుడు: కార్తీక్ ఆర్యన్
ఉత్తమ నటి: పార్వతి తిరువోతు
ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్
ఈక్వాలిటీ ఇన్ సినిమా: డంకీ
ఉత్తమ దర్శకుడు: కబీర్ ఖాన్ (చందు ఛాంపియన్), నితిలన్ స్వామినాథన్(మహారాజా)
ఉత్తమ పెర్ఫార్మర్ క్రిటిక్ ఛాయిస్: విక్రాంత్ మాస్సే (12th ఫెయిల్)
ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ ఛాయిస్: లాపతా లేడీస్
సినిమా ఎక్స్‌లెన్స్: ఏఆర్ రెహమాన్
ఆ అవార్డుల వెనుకకు హాజరైన రాంచరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' (Game changer) చిత్రంతో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సానా బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్ ఓ సినిమా కమిట్ అయ్యారు. మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకెళ్లనుందని సమాచారం. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయిక. రామ్‌చరణ్ మెల్‌బోర్న్ నుంచి వచ్చాక 'గేమ్ ఛేంజర్' పెండింగ్ వర్క్ పూర్తి చేసి తదుపరి చిత్రం షూటింగ్‌లో అడుగుపెడతారని టాక్.