మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rakhi Sawant: నన్ను కొనుక్కోండి.. జీరో సైజ్‌తో ఆయన్ను తృప్తి చేసి పంపిస్తాను!

ABN, Publish Date - Mar 07 , 2024 | 10:33 PM

రిలయన్స్‌ ఇండస్ట్రీస్  అధిపతి ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్‌ వేడుకలు ఇటీవల గుజరాత్‌లోని జామ్‌నగర్‌ వేదికగా మూడు రోజులపాటు ఘనంగా జరిగాయి. తాజాగా అంబానీ ఫంక్షన్‌పై బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌ స్పందించింది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్  అధిపతి ముకేశ్‌ అంబానీ (mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ (Ananth ambani), రాధిక మర్చంట్‌ల(Radhika merchant) ప్రీ-వెడ్డింగ్‌ వేడుకలు ఇటీవల గుజరాత్‌లోని జామ్‌నగర్‌ వేదికగా మూడు రోజులపాటు ఘనంగా జరిగాయి. దేశ, విదేశాల్లో పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. బాలీవుడ్‌ ఖాన్  త్రయంతోపాటు ఎంతోమంది స్టార్‌లు ఆడిపాడి అలరించారు. తాజాగా అంబానీ ఫంక్షన్‌పై బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌ (Rakhi sawanth) స్పందించింది. ఎంతోమంది స్టార్లు అతిథులుగా హాజరై ఘనంగా జరిగిన ఈ వేడుకకు తనను ఎందుకు పిలవలేదని ఆమె ప్రశ్నించింది. ఒకవేళ తనను పిలిచి ఉంటే ఫ్లోర్‌ క్లీన్‌ చేయడం నుంచి వంట పాత్రలు కడగడం వరకు తానే స్వయంగా చేసే దానినంటూ ఆమె పేర్కొంది. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేసింది. ‘అంబానీ జీ నమస్తే. నన్ను పెళ్లికి ఎందుకు పిలవలేదు? మీరు ఇంకా నా డ్యాన్స్‌ చూడలేదనుకుంటా.. మీరు సింగర్‌ రిహానాతో పాటుగా ఖాన్‌, ఐకాన్ అంటూ ఎందరినో పిలిచారు. మీ వేడకలో వారు చేసిన డ్యాన్స్‌ నా ముందు జుజూబీ.. మీరు నా డాన్స్‌ చూశారా? మున్నీ బద్నామ్‌ హుయ్‌ డార్లింగ్‌ తేరే లియే, తుక్‌ తుక్‌ దేఖే ఇలా చాలా పాటలు చేశాను. అవన్నీ మీరు చూడలేదు అనుకుంటా. మీరు వేల కోట్లు డబ్బు ఇచ్చినా రిహానా చిరిగిన బట్టలతో వచ్చింది. నాకు రూ. 10 కోట్లు ఇచ్చి ఉంటే మీకు ఎన్నో ప్రయోజనాలు ఉండేవి. మీ అతిథులందరి గదులు శుభ్రం చేయడం నుంచి వంట పాత్రలు వరకూ కడిగే వరకూ అన్ని చేసేదాన్ని’’ అని కామెంట్‌ చేసింది.



అనంత బరువుపై కామెంట్స్‌..
అనంత్‌ అంబానీ బరువుపై వ్యాఖ్యలు చేసింది రాఖీ సావంత. డియర్‌ అంబానీ జీ.. అనంత్‌ అంబానీ బాగా బరువు పెరిగారు. మీ కోడలు చూస్తే మరీ సన్నగా ఉంది. మీ అనంతను నా వద్దకు 5రోజుల పాటు పంపించండి. కట్టెపుల్లలా సన్నగా చేసి పంపుతాను. దీని కోసమైన కొంత డబ్బు ఇచ్చి నన్ను  కొనుక్కోండి. ఆయనతో కసరత్తులు చేయించడమే కాకుండా.. తృప్తి చేసి పంపిస్తాను. అనంత అంబానీని జీరో సైజ్‌కు చేర్చి మీ వద్ద ఉంచే బాధ్యత నాది. ఆయన బరువు తగ్గితే మీతో పాటటుగా మీ కోడలు కూడా చాలా సంతోషిస్తుంది. అసలే మీ కోడలు దానిమ్మ పండులా ఉంది. ఆయన సన్నగా అయితే ఆమెకే మంచిది.’ అని రాఖీ సావంత్‌ సోషల్‌ మీడియాలో వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేసింది.




అయితే రాఖీ సావంత్ వ్యాఖ్యలకు నెటిజన్లు మండిపడుతున్నారు. అనారోగ్య సమస్యలతో బరువు పెరిగినట్లు స్వయంగా ఆయన చెబుతూ ప్రీవెడ్డింగ్‌ వేదికపైనే భావోద్వేగానికి గురయ్యాడు. అలాంటి వ్యక్తి గురించి ఇలా వల్గర్‌గా మాట్లాడడానికి సిగ్గులేదా అని ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఆయన అమ్మగారు అయిన  నీతా అంబానీ కూడా అనంత్‌ ఆరోగ్య సమస్యల గురించి గతంలో వివరించారు. అనారోగ్య కారణాలతో కొన్ని రకాల స్టెరాయిడ్స్‌ వాడటం వల్ల అనంత్‌ బరువు పెరిగాడని ఆమె చెప్పుకొచ్చారు’’ అంటూ నెటిజన్లు రాఖీ సావంత్ మండిపడుతున్నారు. 

Updated Date - Mar 07 , 2024 | 10:36 PM