Rajinikanth: సింపుల్‌గా ఉండే రజనీ.. ఓ అడుగు ముందుకేశారు
ABN, Publish Date - Jul 13 , 2024 | 01:26 PM
ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తరలివచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ(Ananth Ambani)-రాధిక మర్చంట్ (Radhika merchant)వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తరలివచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, అన్నింటికన్నా తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. తెరపై తనదైన స్టైల్, డైలాగ్ డెలివరీతో అదరగొట్టే రజనీకాంత్ బయట మాత్రం చాలా సింపుల్‌గా ఉంటారు. ఏదైనా వేడుకకు హాజరైనా అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటారు. అయితే, అనంత్-రాధికా మర్చంట్ వివాహ వేడుకలో ఓ అడుగు ముందుకువేసి, ఏకంగా బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేశారు. రజనీకాంత్ ఇలా డ్యాన్స్ చేయడాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ‘తలైవా ఇరగదీశారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. రజనీతోపాటు బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూడా స్టెప్పులేశారు.