Raj And Dk: దేని గురించి ఆలోచించే పని లేదు.. సూటిగా సుత్తి లేకుండా!
ABN, Publish Date - Mar 07 , 2024 | 07:47 PM
'షోర్ ఇన్ ద సిటీ, 'హ్యాపీ ఎండింగ్’ వంటి చిత్రాలతోపాటు ఇటీవల 'ఫ్యామిలీ మ్యాన్’ (Family Man)సిరీస్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకులు రాజ్ అండ్ డీకే. ప్రస్తుతం ఓటీటీ పై దృష్టిపెట్టిన ఈ దర్శక ద్వయం ఓ కార్యక్రమంలో ఓటీటీలపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
'షోర్ ఇన్ ద సిటీ, 'హ్యాపీ ఎండింగ్’ వంటి చిత్రాలతోపాటు ఇటీవల 'ఫ్యామిలీ మ్యాన్’ (Family Man)సిరీస్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకులు రాజ్ అండ్ డీకే. ప్రస్తుతం ఓటీటీ పై దృష్టిపెట్టిన ఈ దర్శక ద్వయం ఓ కార్యక్రమంలో ఓటీటీలపై (Comments on OTT) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘'థియేటర్‌లో విడుదలయ్యే సినిమాలకు, ఓటీటీలో వచ్చే వాటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మేము మొదట సిరీస్ తీయాలనుకున్నప్పుడు ఓటీటీ సంస్థలు లేవు. నెట్‌ఫ్లిక్స్ భారతకు రాలేదు. ఆ సమయంలో సిరీస్‌ను ప్రేక్షకులకు ఎలా అందించాలో అర్థమయ్యేది కాదు. అందుకే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ రాగానే మేమే మొదట అందులో సిరీస్‌ను విడుదల చేశాం. దీని కోసం ఏదైనా రూపొందించినప్పుడు కంటెంట్ విషయంలో రాజీ పడాల్సిన అవసరం ఉండదు. ఇన్ని గంటల్లోనే సిరీస్‌ను ముగించాలి అనే టెన్షన్ ఉండదు. మన వద్ద ఉన్న కంటెంట్ మొత్తాన్ని ప్రేక్షకులకు నచ్చేలా చెప్పొచ్చు. అది 2 గంటలైనా కావొచ్చు..10 ఎపిసోడ్‌ల నిడివైనా ఉండొచ్చు. దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం అనుకుంటున్న కథను కుదించక్కర్లేకుండా తెరకెక్కించవచ్చు. మేము ఇప్పుడిప్పుడే ఏఐను ఉపయోగిస్తున్నాం. క్యారెక్టర్ రూపురేఖలు ఎలా ఉండాలో ఏఐ సాయంతో తీర్చిదిద్దుతున్నాం’ అని అన్నారు.
గతేడాది ‘ఫర్జీ’, ‘గన్స్ అండ్ గులాబ్స్’తో అలరించిన ఈ దర్శకులు ప్రస్తుతం ‘సిటడెల్’ వెబ్‌సిరీస్‌తో బిజీగా ఉన్నారు. త్వరలోనే స్ట్రీమింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు సిటాడెల్ హాలీవుడ్ సిరీస్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ నటించగా తెలుగు వెర్షన్‌లో సమంత-వరుణ్ ధావన నటించారు.