Priyanka Chopra: నెపోటిజంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రియాంక తల్లి

ABN, Publish Date - Oct 17 , 2024 | 03:30 PM

తాజాగా ప్రియాంక తల్లి మధు చోప్రా నెపోటిజంపై చేసిన వ్యాఖ్యలు భిన్నంగా ఉన్నాయి. అలాగే ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఇంతకీ ఏమైందంటే..

Priyanka with her Mother Madhu Chopra

బాలీవుడ్‌ని రెండు దశాబ్ద కాలం ఏలిన తార ప్రియాంక చోప్రా (Priyanka Chopra ). ఈ బాలీవుడ్ (Bollywood ) క్వీన్ హాలీవుడ్‌కి షిఫ్ట్ అయిన తర్వాత గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. అయితే ఒక అవుట్ సైడర్‌గా ఇన్నేళ్ల ప్రయాణంలో ఆమె ఎన్నో ఒడిదుడుకులు దాటుకొని వచ్చారు. ఈ విషయాన్నీ గతంలోనూ ప్రియాంక.. నెపోటిజం ఇబ్బందులపై మాట్లాడారు. అయితే, తాజాగా ప్రియాంక తల్లి మధు చోప్రా నెపోటిజంపై చేసిన వ్యాఖ్యలు భిన్నంగా ఉన్నాయి. అలాగే ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఇంతకీ ఏమైందంటే..


కేవలం బాలీవుడ్‌నే కాదు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఏ చిత్ర పరిశ్రమైన నెపోటిజం టాలెంటెడ్ యాక్టర్స్ పట్ల విషంగా మారుతుంది. ప్రధానంగా మన దేశంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఆరోపణలు ఎప్పుడు రచ్చ రేపుతుంటాయి. ఈ ఇండస్ట్రీలోనే అనేక ఒడిదుడుకులు ఎదురుకొని.. టాప్ యాక్ట్రెస్‌గా ఎదిగి ఇండస్ట్రీని ఏలిన ప్రియాంక చోప్రాకి కూడా ఈ తిప్పలు తప్పలేదు. అయితే దీనికి భిన్నంగా ప్రియాంక తల్లి మధు చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. రీసెంట్‌గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. "నెపోటిజం అనేది ప్రస్టేటెడ్ జనాలు మాత్రమే వాడే పదం. టాలెంట్, మెరిట్ ఉన్న వాళ్ళు నెపోటిజం ప్రసక్తి తీసుకురారు. ఇది ప్రతి పరిశ్రమలో తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. ప్రేమించే వారికోసం తల్లితండ్రులు అవకాశాలు కల్పించడం సాధారణం. కానీ.. వారి టాలెంట్ ని మెరుగుపరిచే బాధ్యత కూడా వారిదే. కేవలం సంబంధాలు ఉన్నంత మాత్రాన ఎవరు డబ్బు పెట్టారు, ట్యాలెంట్ ముఖ్యం" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి.


మరోవైపు ప్రియాంక గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "2008లో నేను వరుస ఫ్లాప్స్ ఎదురుకుంటున్న సమయంలో చాలా ఆందోళన చెందాను. నేను నెపో-బేబీ కాకపోవడంతో నన్ను ఆదుకున్న నాధుడే లేకపోయాడు. నాతో పాటు మా అమ్మ కూడా భయపడింది. బిజినెస్ మైండ్ కల్గిన మా అమ్మ.. నన్ను ఇన్‌కం కోసం మరో దారి చూసుకోమంది, నా వయసు 30 దాటినా తర్వాత యంగ్ యాక్టర్స్ నాతో నటించడానికి వెనుకాడుతారని ముందే చెప్పింది. మా అమ్మ ముందు చూపు వల్లే నేను ప్రొడక్షన్‌లోకి అడుగు పెట్టాను" అని అన్నారు. దీంతో ప్రియాంక మాటలకి, తన తల్లి మాటలకి పొంతన కుదరట్లేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Updated Date - Oct 17 , 2024 | 03:30 PM