Preity Zinta: మీరిద్దరూ డేట్ చేశారా ... ప్రీతి జింటా షాక్
ABN, Publish Date - Dec 28 , 2024 | 03:45 PM
బాలీవుడ్ నటి ప్రీతి జింటాకు షాకింగ్ ప్రశ్న ఎదురైంది. సల్మాన్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘మీ ఇద్దరూ ఎప్పుడైనా డేట్‌లో ఉన్నారా?’’ అని ప్రశ్నించాడు.
బాలీవుడ్ నటి ప్రీతి జింటాకు (Priety ZInta) షాకింగ్ ప్రశ్న ఎదురైంది. సల్మాన్ ఖాన్ (Salman khan) పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘మీ ఇద్దరూ ఎప్పుడైనా డేట్‌లో ఉన్నారా?’’ అని ప్రశ్నించాడు. దీనిపై ఆమె తనదైన శైలిలో బదులిచ్చారు. సల్మాన్ తనకు కుటుంబ సభ్యుడితో సమానం అని చెప్పారు. ‘‘మేమిద్దరం అస్సలు డేట్ చేయలేదు. తను నాకు కుటుంబ సభ్యులతో సమానం. అలాగే నా భర్తకూ అతను మంచి స్నేహితుడు. నా సమాధానం తో మీరు ఆశ్చర్యానికి గురైతే నన్ను క్షమించండి’’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్ (Netizen Questions) తీరుపై పలువురు అసహనం వ్యక్తంచేశారు. పెళ్లయిన తర్వాత ఒక నటిని ఇలాంటి ప్రశ్నలు వేయడం ఏ మాత్రం సరి కాదని హితవు పలికారు. ‘దిల్ సే’ చిత్రంతో ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన ఆమె ఎన్నో ప్రేమకథా చిత్రాల్లో నటించింది. ‘ప్రేమంటే ఇదేరా’, ‘రాజ కుమారుడు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. 2018లో విడుదలైన ‘భయాజీ సూపర్‌హిట్’ తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ‘లాహోర్ 1947’ కోసం వర్క్ చేస్తున్నారు. ప్రీతి జింటా, సల్మాన్‌ఖాన్ ‘హర్ దిల్ జో ప్యార్ కరేగా’, ‘చోరీ చోరీ చుప్కే చుప్కే’ వంటి హిందీ చిత్రాలతో ఆన్‌స్ర్కీన్ మంచి జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ చిత్రాల వల్ల వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. సల్మాన్ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏడాది ఆమె విషెస్ తెలుపుతుంటారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భఃగా పోస్ట్ పెట్టారు. పలు సందర్భాల్లో ఆయనతో దిగిన ఫొటోలను షేర్ చేసింది. ‘‘హ్యాపీ బర్త్‌డే సల్మాన్. లవ్ యూ మోస్ట్. మిగిలిన విషయాలు మనం కలిసినప్పుడు చెబుతా. మనం కలిసి ఎన్నో ఫొటోలు దిగాలి. లేదంటే ఆ పాత ఫొటోలనే నేను ప్రతిసారీ పోస్ట్ చేస్తా’’ అని సరదాగా అన్నారు.