మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rakul Preet Singh: మొద‌లైన సంబ‌రం.. ర‌కుల్ ఇంట గ్రాండ్‌గా పెళ్లి వేడుక‌

ABN, Publish Date - Feb 17 , 2024 | 03:09 PM

ర‌కుల్ ప్రీత్ సింగ్ త్వ‌ర‌లో త‌న ప్రియుడు బాలీవుడ్ అగ్ర నిర్మాత జాకీ భగ్నానీతో క‌లిసి పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న విష‌యం తెలిసిందే.

rakul

మాములుగా సెల‌బ్రిటీ ఇంట ఓ వేడుక అంటేనే ఓ స్థాయిలో రెండు మూడు రోజుల పాటు హంగామా ఉంటుంది. అలాంటిది ఓ స్టార్ హీరోయిన్ ప్రేమ వివాహం అంటే ఇంకా చెప్పాల్సిన ప‌నే ఉండ‌దు. తాజాగా ర‌కుల్ పెళ్లి విష‌యంలోను అదే జ‌రుగుతోంది. తెలుగునాట కొంతకాలం ఓ వెలుగు వెలిగిన క‌థానాయిక ర‌కుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) త్వ‌ర‌లో త‌న ప్రియుడు బాలీవుడ్ అగ్ర నిర్మాత జాకీ భగ్నానీ (Jackky Bhagnani) తో క‌లిసి పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న విష‌యం తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి 21న గోవా వేదిక‌గా అతి కొద్దిమంది స‌న్నిహితుల స‌మ‌క్షంలో వీరి వివాహం జ‌రుగ‌నుంది.

దీంతో బాలీవుడ్‌, టాలీవుడ్ మీడియాల‌లో నెల రోజుల ముందు నుంచే సంద‌డి మొద‌లైంది. వారి పెళ్లికి సంబంధించిన చిన్న వార్త అయినా స‌రే సోష‌ల్‌మీడియాలో ట్రెండింగ్‌లోకి వ‌చ్చేస్తోంది. ఓ వ‌ర్గం మీడియా ప్ర‌తి క్ష‌ణం ర‌కుల్ చుట్టే తిరుగుతున్నాయి. ఏ క్ష‌ణాన ఎటు వెళుతున్న‌ది కండ్ల‌లో ఒత్తులేసుకుని మ‌రి గ‌మ‌నిస్తోంది. దీంతో వారి ప్ర‌తి క‌ద‌లిక నెట్టింట వైర‌ల్ అయి కూర్చుంటోంది.

ముందుగా డెస్టినేష‌న్ వెడ్డింగ్ అంటూ తెగ ప్ర‌చారం జ‌రుగ‌గా త‌ర్వాత పెళ్లి వేదిక‌ గోవాకు షిఫ్ట్ అయింది. ఇప్పుడు ర‌కుల్, జాకీ పెళ్లికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో వారి ప్ర‌తి మూమెంట్ యూట్యూబ్ ఛాన‌ళ్లు, వెబ్‌సైట్ల‌కు మంచి కంటెంట్ దొరుకుతోంది. నిత్యం వాళ్ల పెళ్లి గురించి ఏదో ఒక వార్త రాస్తు సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. ఎక్స్‌లో అయితే #RakulJackkywedding అనే యాష్ ట్యాగ్ వారం రోజులుగా ట్రెండింగ్‌లో ఉంటోంది.


ఇక‌.. ర‌కుల్ జాకీ పెళ్లి మ‌రో మూడు నాలుగు రోజులే ఉండ‌గా తాజాగా వారి వివాహా ఆహ్వాన పత్రిక ఇంట‌ర్నెట్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇప్ప‌టికే ఫ్రీ వెడ్డింగ్ వేడుక‌లు మొద‌లవ‌గా ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో బాగా వైర‌ల్ అవుతున్నాయి. అంతేగాక ప్ర‌ముఖ‌ దేవాల‌యాల‌న్నింటినీ ద‌ర్శించుక‌ని ప్రత్యేక పూజ‌లు చేస్తున్నారు. అయితే వీరి పెళ్లి ఎకో ఫ్రెండ్లీగా ప్ర‌కృతికి హానీ క‌లిగించ‌కుండా పేప‌ర్ వేస్ట్ను త‌గ్గిస్తూ, ఫైర్ కాక్రర్స్ కాల్చ‌కుండా జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. అదేవిధంగా వివాహం అనంత‌రం చెట్ల‌ను నాట‌నున్న‌ట్లు స‌మాచారం.

Updated Date - Feb 17 , 2024 | 03:09 PM