Pooja hegde: మళ్లీ వార్తల్లో బుట్టబొమ్మ.. డేటింగ్ నిజమేనా?
ABN, Publish Date - Apr 01 , 2024 | 05:06 PM
ఆచార్య’ చిత్రం తర్వాత తెలుగులో మరో చిత్రం అంగీకరించలేదు పూజాహెగ్డే. మధ్యలో 'గుంటూరు కారం’ అవకాశం వచ్చి చేజారింది.
'ఆచార్య’ చిత్రం తర్వాత తెలుగులో మరో చిత్రం అంగీకరించలేదు పూజాహెగ్డే. (pooja hegde) మధ్యలో 'గుంటూరు కారం’ (guntur kaaram) అవకాశం వచ్చి చేజారింది. దాదాపు ఆమె నుంచి సినిమా వచ్చి రెండేళ్లు కావొస్తుంది. అయితే హిందీలో మాత్రం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. అయితే కొంతకాలంగా ఆమెపై ప్రేమలో ఉందనే టాక్ నడుస్తోంది. గత ఏడాది ఒక క్రికెటర్‌తో డేటింగ్లో ఉందని, త్వరలో అతనితో పెళ్లి చేసుకోనుందని ఊహాగానాలు వచ్చాయి. కొంత కాలం తర్వాత ఆ ఊహాగానాలు కేవలం గాసిప్స్ మాత్రమే అని తేలింది. అయితే, పూజా హెగ్డే రొమాంటిక్ లైఫ్ గురించి ఇప్పుడు తాజాగా మళ్లీ వదంతులు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో (Rohan mehra) పూజా డేటింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా వారిద్దరూ కలిసి కారులో ప్రయాణిస్తున్న దృశ్యాలు బయటికొచ్చాయి. కారులో ప్రయాణిస్తూ కెమెరాకు చిక్కారు ఈ జోడి. కెమెరాలు షూట్ చేస్తుండగా పూజా మొహానికి చేయి అడ్డుపెట్టుకుని సిగ్గుపడుతున్నట్లు కనిపించింది. రోహన్ మెహ్రా 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ ఫేమ్ ‘తారా సుతారియా’తో రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అతను ఇప్పుడు పూజా హెగ్డేతో ప్రేమాయణం సాగిస్తున్నాడని ఆరోపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్త పూజా హెగ్డేను అభిమానించే వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో సల్మాన్ ఖాన్ తో ప్రమాయణం సాగిస్తుందనే వార్తలొచ్చిన సమయంలో పూజా ఘాటుగా స్పందించింది. ‘నా గురించి తరచూ ఎన్నో వార్తలు వస్తుంటాయి. వాటన్నింటినీ నేను చదువుతా కానీ పెద్దగా పట్టించుకోను. ప్రస్తుతానికి నేను సింగిల్‌నే. నాకు సింగిల్‌గా ఉండటమే ఇష్టం. అలాగే, నా ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉంది. వేర్వేరు భాషల్లో మరెన్నో చిత్రాల్లో నటించాలని ఉంది. అదే నా లక్ష్యం. ఈ గాసిప్స్‌పై స్పందించే సమయం కూడా నాకు లేదు. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను’’ అని అన్నారు. (Pooja dating with Rohan mehra)
200 కంటే ఎక్కువ కమర్షియల్ యాడ్స్, పలు ప్రింట్ యాడ్స్ చేసిన రోహన్ మెహ్రా రెండు సినిమాలో నటించారు. ఆ రెండు కూడా ఫ్లాప్ అయ్యాయి. హిందీ బిగ్‌బాస్ 10వ సీజన్లో సెలబ్రిటీ కంటెస్టెంట్‌గా ప్రవేశించిన రోహన్ 5వ స్థ్థానంలో నిలిచాడు. టీవీ షోల ద్వారా గుర్తింపు పొందాడు. అంతటి సాధారణ వ్యక్తిని పూజా హెగ్డే ప్రేమించడం జరగదని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై పూజా హెగ్డే స్పందించలేదు. అయితే వారిద్దరూ స్నేహితులా, లేక ప్రేమలో ఉన్నారా అన్నది తెలియాలంటే పూజ స్పందించాల్సిందే!