Raveena Tandon: ముందే ప్లాన్ చేశారు.. తనపై అటాక్ చేసిన గుంపుపై షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - Oct 15 , 2024 | 09:05 PM

ప్రస్తుతం బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, లారెన్స్ బిష్ణోయ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే సల్మాన్‌పై రెండు మూడు సార్లు అటాక్ జరిగింది. ఆ అటాక్ చేసిందెవరో కూడా క్లారిటీ ఉంది. దీంతో బాలీవుడ్ అంతా భయాందోళనలలో ఉంటే.. తాజాగా బాలీవుడ్ నటి రవీనా టాండన్ కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టింది. తనపై అటాక్ జరిగిన మరుసటి రోజే రిచా చద్దాపై కూడా జరిగిందని రవీనా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Raveena Tandon and Richa Chadha

ప్రస్తుతం బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ (Salman Khan), లారెన్స్ బిష్ణోయ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే సల్మాన్‌పై రెండు మూడు సార్లు అటాక్ జరిగింది. ఆ అటాక్ చేసిందెవరో కూడా క్లారిటీ ఉంది. దీంతో బాలీవుడ్ అంతా భయాందోళనలలో ఉంటే.. తాజాగా బాలీవుడ్ నటి రవీనా టాండన్ కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టింది. జూన్ నెలలో రవీనా టాండన్ (Raveena Tandon), ఆయన డ్రైవర్‌పై ఓ గుంపు అటాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ అటాక్‌కి కారణం డ్రైవర్ మిస్టేక్ అని అంతా ముందు అనుకున్నారు. కానీ ఇదంతా ప్రీ ప్లాన్డ్ స్కెచ్ అనేలా షాకింగ్ విషయాలను బయటపెట్టింది రవీనా టాండన్. తాజాగా రవీనా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో జూన్‌లో ఆమెపై అటాక్‌కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె సమాధానం ఇస్తూ..

Also Read- Jr NTR: ‘దేవర’ ప్రీ రిలీజ్ వేడుక, సక్సెస్ మీట్ లేకపోవడంతో.. తారక్ ఏం చేశారంటే

‘‘నాపై అటాక్ జరిగిన మరుసటి రోజే రిచా చద్దా (Richa Chadha) కూడా ఇలాంటి అటాక్‌కే గురైంది. ఓ గుంపు ఆమెపై కూడా ఇలానే దాచి చేసినట్లుగా తెలిసింది. అయితే ఇదంతా డబ్బుకోసం ఓ గుంపు ముందస్తుగా చేసుకున్న స్కెచ్ అని రిచా అటాక్‌తో పాటు పోలీసులు సైతం చెప్పడంతో నేను ఆశ్చర్యపోయాను. ప్రస్తుతం ముంబైలో ఇటువంటి సంఘటనలు ఎక్కువయ్యాయి. ఆ గ్యాంగ్ అంతా భయపెట్టి ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలనే ప్లాన్‌లో తిరుగుతున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. రిచా చద్దా కూడా నాకు ఫోన్ చేసి.. నీకు ఎలా అయితే జరిగిందో.. నాకు కూడా అలానే జరిగిందని చెప్పుకొచ్చింది. కానీ సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో.. పోలీసుల ద్వారా సెటిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఆమెకు ఎదురైంది. తర్వాత పోలీసులే.. ఇదంతా డబ్బుకోసం ఓ గ్యాంగ్ చేస్తున్న పనిగా పోలీసులు కూడా గుర్తించారు. నా విషయంలో కూడా బెదిరించి ఎలాగైనా డబ్బు వసూలు చేయాలనే అలా అటాక్ చేశారు. నాకు బాగా గుర్తుంది. వాళ్లలో కొందరు చాలా దూకుడుగా ప్రవర్తించారు. ఆ సమయంలో నా పిల్లలు మేడపై ఉన్నారు. ఇంట్లోకి చొరబడి.. నా స్టాఫ్‌లోని మగవాళ్లని కొట్టారు. అప్పుడు నేను, నా స్టాఫ్‌లోని మరో ఇద్దరు లేడీస్ గేటుకి అడ్డంగా నిలబడి వారిని లోనికి రానియకుండా అడ్డుగా నిలుచున్నాం. అయినా సరే వినడం లేదు.. డ్రైవర్‌ని అప్పగించాలని ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. నిజంగా మా డ్రైవర్‌ని తప్పు ఉంటే.. పోలీసులు వచ్చి అతనిని తీసుకెళతారని నేను చెప్పినా కూడా వినలేదు. నువ్వు ఎవరు న్యాయం చెప్పడానికి అంటూ ఆవేశంగా మీద మీదకి వస్తూనే ఉన్నారు’’ అని రవీనా ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.


అసలు ఏం జరిగిందంటే..

జూన్ 1న కార్టర్ రోడ్డులోని రిజ్వీ కాలేజ్ దగ్గర తన కారు ర్యాష్ డ్రైవింగ్‌తో వచ్చి ఒక మహిళను ఢీ కొట్టిందంటూ రవీనా టాండన్‌పై కేసు నమోదవగా.. దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. అయితే ఆ వీడియోలో కారు రివర్స్ చేసుకుంటూ ఉండగా ఓ మహిళ అడ్డొచ్చింది. ఆ మహిళకు కారు కూడా తగలలేదు. కానీ ఆ మహిళను ఢీ కొట్టిందంటూ.. రవీనా డ్రైవర్‌ను కొట్టడం మొదలుపెట్టారు. డ్రైవర్‌ను కొడుతుండటంతో.. రవీనా అడ్డుపడే ప్రయత్నం చేయగా.. ఆమెపై కూడా దాడికి దిగారు సదరు గ్యాంగ్. ఆ వీడియోలో రవీనా టాండన్ చుట్టూ చేరిన గుంపును తనను కొట్టవద్దని వేడుకోవడం తెలుస్తోంది. ఇక కేసు ఫైల్ అయిన తర్వాత పోలీసులు విచారణ జరపగా.. అసలు కారు ఎవరికీ తగలలేదని వీడియోలో స్పష్టమైంది. ఈ విషయం బయటికి రాక ముందు అంతా రవీనా టాండన్‌పై విమర్శలు గుప్పించారు. అసలు విషయం తెలిసినా.. బాలీవుడ్‌‌లో ఎవరూ స్పందించకపోవడం విశేషం.

Also Read- RGV: సల్మాన్‌లో చావు భయం..

Also Read- Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' టీజర్.. ఎగిరే గుర్రంపై చిరు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 15 , 2024 | 09:05 PM