Pawan Kalyan: అంబానీ పెళ్లింట పవన్ సందడి!
ABN, Publish Date - Jul 14 , 2024 | 04:27 PM
అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్ పెళ్లి ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. అంతకు మించి కొత్త జంట ‘శుభ ఆశీర్వాద్’ కార్యక్రమం మరింత గ్రాండ్‌గా నిర్వహించింది అంబానీ ఫ్యామిలీ
అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్ పెళ్లి ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. అంతకు మించి కొత్త జంట ‘శుభ ఆశీర్వాద్’ కార్యక్రమం మరింత గ్రాండ్‌గా నిర్వహించింది అంబానీ ఫ్యామిలీ.
అయితే ఈ వేడుకలో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితోపాటు జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. పవన్ గ్రాండ్ ఎంట్రీ పెళ్లికి హాజరైన అతిథుల్ని అందర్నీ ఆకట్టుకుంటోంది. అంబానీ ఫ్యామిలీ పవన్ కు ఆహ్వానం పలికి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
వారాహి మాలలోనే వెళ్లిన పవన్ శుభ ఆశీర్వాద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత పవన్ ను ఆలింగనం చేసుకున్నారు. గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ పవన కూడా వేడకలో పవనకు కలిశారు.