Rakul-Bhagnani: మోదీ సర్‌ప్రైజ్.. మీ ఆశీస్సులు మాకెంతో ప్రత్యేకమంటూ కృతజ్ఞతలు
ABN, Publish Date - Feb 23 , 2024 | 01:25 PM
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul)-జాకీ భగ్నానీ (jockey bhagnani) నాలుగేళ్ల ప్రేమాయణం తర్వాత మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఈ నెల 21న గోవాలో వీరిద్దరి వివాహం జరిగింది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul)-జాకీ భగ్నానీ (jockey bhagnani) నాలుగేళ్ల ప్రేమాయణం తర్వాత మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఈ నెల 21న గోవాలో వీరిద్దరి వివాహం జరిగింది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా వీరికి భారత ప్రధాని మోదీ (PM Narendra modi) కూడా శుభాకాంక్షలు చెబుతూ లేఖ పంపారు. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లా కాకుండా స్వదేశంలోనే వీరు పెళ్లి చేసుకోవడాన్ని చాలా మంది ప్రశంసిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం వెనుక ప్రధాని మంత్రి నరేంద్రమోదీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియాలో పెళ్లి చేసుకుని మన టూరిజం అభివృద్థికి సహకరించాలని మోదీ పలువురు సెలబ్రిటీలను కోరారని, అందులో రకుల్ జంట కూడా ఉన్నారని తెలిసింది.
మోదీ సూచన మేరకు ఇక్కడే గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లికి ప్రధాని మోదీకి కూడా ఆహ్వానం అందింది. బిజీ షెడ్యూల్ కారణంగా మోదీ రకుల్ - జాకీ పెళ్లికి హజరకాలేకపోయారు. వీరి పెళ్లి నేపథ్యంలో ఈ జంటకు తాజాగా ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు చెబుతూ ఓ లేఖను రకుల్ దంపతులకు పంపారు. దానికి జాకీ భగ్నానీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీనిపై నూతన జంట స్పందించారు. "మీరు ఇచ్చిన ఆశీర్వాదాలు మాకు ఎంతో ముఖ్యమైనది. చాలా కృతజ్ఞతలు మోదీ గారు’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.