మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mrunal Thakur: కంటి నిండా నిద్ర కోసం ఆరాటపడ్డాను

ABN, Publish Date - Mar 19 , 2024 | 03:27 PM

'సీతారామం’ (Sitaramam) చిత్రంలో సీతగా మెప్పించి ఓవర్‌నైట్‌ స్టార్‌ అయింది మృణాల్‌ ఠాకూర్‌(mrunal thakur) . ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. గత ఏడాది రెండు భాషల్లో ఆమె నటించిన ఆరు చిత్రాలు విడుదలయ్యాయి.


'సీతారామం’ (Sitaramam) చిత్రంలో సీతగా మెప్పించి ఓవర్‌నైట్‌ స్టార్‌ అయింది మృణాల్‌ ఠాకూర్‌(mrunal thakur) . ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. గత ఏడాది రెండు భాషల్లో ఆమె నటించిన ఆరు చిత్రాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది కూడా మూడు చిత్రాలు సెట్స్‌ మీదున్నాయి. విజయ్‌ దేవరకొండతో నటిస్తున్న 'ఫ్యామిలీస్టార్‌’ షూటింగ్‌ ఇటీవల పూర్తయింది. ప్రస్తుతం ఆమె కాస్త వెకేషన్ లో  ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ‘సరదాగా తీసుకునే చిన్న చిన్న విరామాలు మనలోని నైపుణ్యాలను మెరుగు పరుచుకోవడానికి, చిత్రాల ఎంపిక విషయంలో ఎంతో దోహదపడతాయి. వేగంగా పరిగెడుతున్న ఈ సినీ ప్రయాణంలో నటీనటులు సరదాగా కొన్ని రోజులు ఫ్యామిలీతో గడపడం, ప్రయాణాలు చేయడం ఎంతో ముఖ్యమని నా అభిప్రాయం. గత రెండేళ్లుగా తీరిక లేకుండా పని చేస్తున్నా. కంటి నిండా నిద్ర కోసం ఆరాట పడిన రోజులు నా జీవితంలో చాలానే ఉన్నాయి. అందుకే షూటింగ్‌ బిజీ పూర్తి కావడంతో కాస్త విరామం తీసుకుని కుటుంబంతో గడిపాను. ఇలాంటి సమయంలో  విలాసవంతమైన విరామాలు ఎంతో ముఖ్యం. కుటుంబంతో గడిపే సమయానికి ఎంతో విలువ ఉంటుంది. ఇలాంటి విరామాల వల్ల కథల ఎంపికలో ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకోగలం. లేదంటే తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఆ సమయం కలిసొస్తుంది’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. తాజాగా ఆమె నటించిన ఫ్యామిలీ స్టార్‌ చిత్రం ఏప్రిల్‌ 5న విడుదల కానుంది. 

Updated Date - Mar 19 , 2024 | 03:36 PM