మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Manisha Koirala: కాలమే పెద్ద గురువు.. 

ABN, Publish Date - May 10 , 2024 | 09:19 PM

‘హీరామండి’ (Heeramandi) షూటింగ్‌ సమయంలో డిప్రెషన్‌కు వెళ్లినట్లు నటి మనీషా కొయిరాలా ( Manisha Koirala)చెప్పారు. ‘బొంబాయి’, ఒకే ఒక్కడు, భారతీయుడు చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులకు చేరువైన ఆమె తర్వాత క్యాన్సర్‌ బారిన పడడంతో కొన్నేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు.

‘హీరామండి’ (Heeramandi) షూటింగ్‌ సమయంలో డిప్రెషన్‌కు వెళ్లినట్లు నటి మనీషా కొయిరాలా ( Manisha Koirala)చెప్పారు. ‘బొంబాయి’, ఒకే ఒక్కడు, భారతీయుడు చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులకు చేరువైన ఆమె తర్వాత క్యాన్సర్‌ బారిన పడడంతో కొన్నేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఆమె సోషల్‌ మీడియా వేదికగా ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. ‘జీవితంలో నేను కృతజ్ఞతతో ఉండాల్సిన క్షణాలు చాలా ఉన్నాయి. ఎన్నో ముఖ్యమైన పాత్రలు చేశాను. గొప్ప దర్శక నిర్మాతలతో పని చేశాను. కాలం నాకు పెట్టిన పరీక్షలో నెగ్గాను. భగవంతుడు దయతో జీవించడానికి నాకు రెండో అవకాశం లభించింది. క్యాన్సర్‌తో పోరాడిన తర్వాత ఒడుదొడుకులు చూశా. కాలం పెద్ద గురువు. నేను ఇప్పుడు దాని విలువను తెలుసుకున్నా’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఇటీవల సంజయ్‌లీలా భన్సాలీ (Sanjay leela Bhansali) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హీరామండి’ వెబ్‌ సిరీస్‌లో మల్లికాజాన్‌గా  ఆకట్టుకున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సిరీస్‌ షూటింగ్‌ సమయంతో కలిగిన అనుభవాన్ని షేర్‌ చేసుకున్నారు. ‘క్యాన్సర్‌ నుంచి కోలుకున్న తర్వాత జీవితం మునుపటిలా ఉండదు. తెలియకుండానే శరీరంలో మార్పులు వస్తాయి. ‘హీరామండి’ షూటింగ్‌ సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లా. సడెన్‌గా ఆలోచనలు మారిపోయేవి. మూడ్‌ స్వింగ్స్‌ ఎక్కువయ్యాయి. ముందు షూటింగ్‌ను పూర్తి చేయాలి. తర్వాత ఆరోగ్యంపై శ్రద్థ పెట్టాలి అని నాలో నేనే ఎన్నిసార్లు  అనుకున్నా. నా పరిస్థితిని దర్శకుడు సంజయ్‌ అర్థం చేసుకున్నారు. 12 గంటలు కాగానే నా పాత్ర చిత్రీకరణ ఆపేసేవారు. నా భయాన్ని, ఆందోళనను ఆయన బాగా అర్థం చేసుకున్నారు’ అని మనీషా అన్నారు. 2012లో అండాశయ క్యాన్సర్‌ బారిన పడిన ఆమె 2015లో కోలుకున్నారు.

Updated Date - May 10 , 2024 | 09:19 PM