Malavika Mohanan: ఆ బాధను పైకి కనిపించకుండా మేనేజ్ చేశా
ABN, Publish Date - Sep 17 , 2024 | 06:30 PM
బాలీవుడ్ సీనియర్ నటి రేఖ(Rekha)తో తన పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు కోలీవుడ్ భామ మాళవికా మోహనన్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు. మోహనన్ కుమార్తె మాళవిక.
బాలీవుడ్ సీనియర్ నటి రేఖ(Rekha)తో తన పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు కోలీవుడ్ భామ మాళవికా మోహనన్ (Malavika mohanan) . ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు. మోహనన్ కుమార్తె మాళవిక. ‘మాస్టర్’, ‘తంగలాన్’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. సిద్థాంత్ చతుర్వేది సరసన ఆమె నటించిన ‘యుధ్రా’ (Yudhra)ఈ నెల 20న విడుదల కానుంది. ప్రభాస్ ‘ది రాజాసాబ్’, కార్తి ‘సర్దార్ 2’తో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. తన కొత్త సినిమా ‘యుధ్రా’ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇతరులను ప్రోత్సహించడంలో రేఖ, రజనీకాంత్ (Rajinikanth)ముందుంటారు. ఓ అవార్డుల వేడుకలో రేఖను మొదటిసారి నేరుగా చూశా. ఆమె పక్కనే కూర్చొన్నా. డిన్నర్ చేశావా? ఎక్కడి నుంచి వచ్చావ్? అంటూ యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆమె మాట్లాడే విధానం ఆకట్టుకుంది. ఓవైపు ఆనందంగా ఉన్నా మరో వైపు.. నాకు పురస్కారం (బియాండ్ ది క్లౌడ్స్ సినిమా) వస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. చివరకు.. నాకు అవార్డు దక్కకపోవడంతో బాధపడ్డా. పైకి కనిపించకుండా మేనేజ్ చేశా. కానీ, నా బాడీ లాంగ్వేజ్ పరిశీలించిన రేఖకు నా ఫీలింగ్ అర్థమైంది. ‘ఫర్వాలేదు.. భవిష్యత్తులో నువ్వు ఎన్నో పురస్కారాలు పొందుతావు’ అంటూ నన్ను ప్రోత్సహించారు’’ అని చెప్పారు. తలైవా రజనీకాంత్ గురించి చెబుతూ ‘‘కోలీవుడ్‌లో నేను నటించిన తొలి సినిమా ‘పేట’. అందులో నేను కీలక పాత్ర పోషించా. నేను ఎక్కడి నుంచి వచ్చానో, నా కుటుంబం గురించి రజనీకాంత్‌కు తెలుసు. ఆయన పెద్ద స్టార్ అయినా.. నేను కంఫర్ట్‌గా ఉన్నానో లేదోనని అడిగేవారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు’’ అని పేర్కొన్నారు.