Malaika Arora: ‘ఇన్నర్ SRK’ని దింపిన మలైకా.. ఐకానిక్ రైలు సీన్‌తో రీల్

ABN, Publish Date - Dec 17 , 2024 | 05:21 PM

‘దిల్ సే’ సినిమాలో ‘చయ్య చయ్య’ అంటూ షారుఖ్‌తో ట్రైన్‌పై ఆడిన ముద్దుగుమ్మ మలైకా అరోరా.. ఇప్పుడు ట్రైన్ లోపల షారుఖ్ ఖాన్ నటించిన సినిమాలోని ఐకానిక్ సన్నివేశాన్ని రీ క్రియేట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా ఆమె షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్, కాజోల్ అగర్వాల్ నటించిన కల్ట్ మూవీ ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’ మూవీ ఇప్పటికే ఎందరికే ఇష్టమైన, ఇనిస్పిరేషన్ మూవీ అని చెప్పడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అందులో ఒక్కో సీన్ ఇప్పుడున్న దర్శకులకు ఒక్కో పాఠం వంటిది. అలాంటి సినిమా నుండి హాట్ బ్యూటీ మలైకా అరోరా ఓ సీన్‌ని రీ క్రియేట్ చేస్తూ ఓ రీల్ చేసింది. ఇప్పుడా రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ సీన్ ఏదని అనుకుంటున్నారా? ఐకానిక్ రైలు సీన్.

Also Read- Allu Arjun: అల్లు అర్జున్‌‌‌ బెయిల్ రద్దు? పోలీసుల షాకింగ్ డెసిషన్..


షారుఖ్ ఖాన్‌తో ‘దిల్ సే’ మూవీలో రైలుపై ‘చయ్యా చయ్యా’ అంటూ సాంగేసుకున్న మలైకా అరోరా.. ఇప్పుడు ట్రైన్ లోపల షారుఖ్ సీన్‌ని రీ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ.. ఒక్కరిని కాదు దాదాపు నలుగురైదుగురిని ట్రైన్‌లోకి తన చేయి ఇచ్చి లాగేసింది. సరదాగా చేసినా.. ఆ ఐకానిక్ సీన్‌ని మాత్రం యాజీటీజ్‌గా దింపేసింది మలైకా అరోరా అండ్ టీమ్. ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’ అనే సినిమా పేరు వినబడితే చాలు అందరికీ గుర్తొచ్చే సీన్ ఇదే. ఆ సన్నివేశంలో షారుఖ్, కాజోల్ నటించిన తీరు అప్పటి జనరేషన్‌ని ఎంతగానో కదిలించింది. ముఖ్యంగా ప్రేమికులకు ఈ సన్నివేశం మరుపురానిది.


ఇంకా మలైకా తన ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేసిన ఈ వీడియోలో.. రైలు ఎక్కేందుకు ప్లాట్‌ఫామ్‌పై పరుగులు పెడుతున్న వ్యక్తులకు రైలులోకి రావడానికి ఆమె సహాయం చేయడం ఇందులో చూడవచ్చు. సేమ్ టు షేమ్ సినిమాలో షారూఖ్ ఖాన్ పాత్ర చేసినట్లే, ఆమె వారికి సహాయం చేసేందుకు తన చేయి చాచింది. అలాగే ఆమెకు చేయి ఇచ్చే వారు ఎక్కడ ట్రైన్ మిస్ అవుతామో అని పరుగెత్తడం గమనించవచ్చు. ఈ వీడియోకు మలైకా.. ‘‘నా మనసులో ఉన్న షారుఖ్‌ని మీ ముందుకు తీసుకువస్తున్నాను. కానీ ఈసారి రైలు పైన ‘చయ్య చయ్య’కు బదులుగా.. ‘నా చేయి పట్టుకుని రైలులో ఎక్కండి!’ అనేలా DDLJ మ్యాజిక్‌ను రీ క్రియేట్ చేస్తున్నాను..’’ అని పోస్ట్ చేసింది. అంతకు ముందు కూడా ఆమె ఇలాంటి వీడియోనే ఒకటి పోస్ట్ చేసింది.

Also Read-Rewind 2024: ఈ ఏడాది అగ్ర హీరోల మెరుపులు ఏమాత్రం..

Also Read-రేలంగి వివాహ ఆహ్వాన పత్రిక: 91 సంవత్సరాల క్రితపు శుభలేఖను చూశారా..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 17 , 2024 | 05:21 PM