Miss World 2024: చెక్ రిపబ్లిక్కు మిస్ వరల్డ్ కిరీటం!
ABN, Publish Date - Mar 10 , 2024 | 12:30 PM
మిస్ వరల్డ్-2024 (Miss world 2024) కిరీటం చెక్ రిపబ్లిక్కు (దక్కింది. ఆ దేశం నుంచి ప్రాతినిథ్యం వహించిన క్రిస్టినా పిస్కోవా( Krystyna Pyszkova) మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్నారు.
మిస్ వరల్డ్-2024 (Miss world 2024) కిరీటం చెక్ రిపబ్లిక్కు (దక్కింది. ఆ దేశం నుంచి ప్రాతినిథ్యం వహించిన క్రిస్టినా పిస్కోవా( Krystyna Pyszkova) మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్నారు. ముంబయి వేదికగా అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో 112 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. టాప్-4లో క్రిస్టినా పిస్కోవా (చెక్ రిపబ్లిక్), యాస్మిన్ అజైటౌన్ (లెబనాన్), అచే అబ్రహాంస్ (ట్రినిడాడ్ - టుబాగో), లీసాగో చోంబోలు నిలిచారు. చివరి వరకూ ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోటీలో మిస్ వరల్డ్ కిరీటం క్రిస్టినాకు దక్కింది. రన్నరప్‌గా లెబనాన్‌కు చెందిన అజైటౌన్ నిలిచారు.
భారీ అంచనాల నడుమ పోటీలో నిలిచిన భారత్‌కు ఈసారి నిరాశే ఎదురైంది. మనదేశం నుంచి ప్రాతినిథ్యం వహించిన కన్నడ భామ సినీశెట్టి (Sini Shetty) టాప్-8కు పరిమితమైంది. ఇతర దేశాల భామలకు గట్టి పోటీ ఇచ్చినా, అజైటౌన్ (లెబనాన్) టాప్-4కు ఎంపిక కావడంతో సినీ శెట్టి అక్కడి నుంచి వెనుదిరిగాల్సి వచ్చింది. ఇక ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన నీతా అంబానీ.. మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డును అందుకున్నారు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్ ఉమెన్ జూలియా మోర్లీ ఈ అవార్డును అందజేశారు.