Kriti Sanon: కథే అసలైన హీరో.. అదంతా అపోహే..
ABN, Publish Date - Apr 12 , 2024 | 11:12 AM
సినిమాకు కథ అసలైన హీరో అంటోంది కృతిసనన్(Kriti Sanon). పెద్ద హీరో మెయిన్ లీడ్ అయినంత మాత్రాన థియేటర్‌కు ప్రేక్షకులు రారని కథలో దమ్ముండి, అది మౌత్ పబ్లిసిటీ ద్వారా బయటకు వెళ్తేనే థియేటర్లు హౌస్ ఫుల్ అవుతాయని ఆమె అన్నారు.
సినిమాకు కథ అసలైన హీరో అంటోంది కృతిసనన్(Kriti Sanon). పెద్ద హీరో మెయిన్ లీడ్ అయినంత మాత్రాన థియేటర్‌కు ప్రేక్షకులు రారని కథలో దమ్ముండి, అది మౌత్ పబ్లిసిటీ ద్వారా బయటకు వెళ్తేనే థియేటర్లు హౌస్ ఫుల్ అవుతాయని ఆమె అన్నారు. టబు, కరీనాకపూర్‌లతో కలిసి ఆమె నటించిన ‘క్రూ’ రూ.వందకోట్లు వసూళ్లు దాటిన నేపథ్యంలో ఆమె నేషనల్ మీడియాతో మాట్లాడారు. (Kriti Sanon comments on Stars)
సినీ రంగంలో వ్యక్తుల మొహమాటానికి ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకోవడం కన్నా.. ఆపదల్లో ఉన్నవారికి నిజాయతీగా అండగా నిలబడితే బాగుంటుంది. పరిశ్రమలో సహనటీనటుల మధ్య ఐక్యతను నేను అంతగా చూడలేదు. ఒక సినిమా హిట్ అయినప్పుడు ఎంతమంది సంతోషిస్తున్నారో.. ఎంతమంది ఏడుస్తున్నారో అర్థం కావట్లేదు. ఒక సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ ఏ ఒక్కరిపైనో ఆధారపడదు. పూర్తి బాధ్యత మొత్తం చిత్రబృందంపై ఉంటుంది.
కాజోల్‌తో కలిసి ‘దో పత్తీ’ చేస్తున్నా. దీని చిత్రీకరణ పూర్తై, నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డా. ముస్సోరీ, నైనిటాల్, మనాలీ లాంటి కొండ ప్రాంతాల్లో దాదాపు దేశమంతా తిరిగా. నిర్మాతగా నాకీ చిత్రం సరికొత్త అనుభవాన్ని ఇచ్చింది. నా మనసుకి నచ్చింది చేయడానికి, మహిళలకు మరిన్ని అవకాశాలు ఇవ్వడానికి మరెన్నో చిత్రాలు నిర్మించాలనుకుంటున్నా.
దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ కేవలం మహిళా పాత్రనే ఎంచుకొని ‘గంగూబాయి కాఠియావాడీ’ తెరకెక్కించారు. ఇందులో హీరో లేడు. అయినా బడ్జెట్ విషయంలో రాజీ పడలేదు. ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలతోపాటురికార్డు వసూళ్లు రాబట్టింది కదా! కళ్లముందే ఇలాంటి సాక్ష్యం కనిపించినప్పుడు హీరోయిన్ల చిత్రాలకు బడ్జెట్ పరిమితులు ఎందుకో తెలియడం లేదు.
సినిమాలో ఒక స్టార్ హీరో ఉన్నంత మాత్రాన ప్రేక్షకులు థియేటర్లలోకి రారు. కథ బాగుంటే.. అందులో ప్రధాన పాత్రధారుడు ఆడా, మగా అని ఎవరూ చూడరు. దురదృష్టవశాత్తు కొందరు దర్శకనిర్మాతల్లో సైతం.. ‘మహిళా ప్రాధాన్య సినిమాలకు ప్రేక్షకులు రారు.. తాము చెల్లించిన టికెట్టుకి సరైన న్యాయం జరగదని ప్రేక్షకులు భావిస్తారనే అభిప్రాయం ఉంది. అది కేవలం అపోహ మాత్రమే. కథానాయకులెవరూ లేకపోయినా ‘క్రూ’ గొప్పగా ఆడుతోంది. ఇది చూశాకేౖనా.. పరిశ్రమలో కొంచెమైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. ప్రేక్షకులు కూడా మారాలి. బాక్సాఫీసు నెంబర్లు చూస్తుంటే.. కథానాయికలు ప్రధాన పాత్రధారులుగా ఉన్న సినిమాలు సైతం అద్భుతాలు సృష్టిస్తాయని అర్థమవుతోంది.
Sahkutumbanaam: స్వచ్చమైన తెలుగింటి టైటిల్