Aamir Khan: విడిపోయినా.. దంపతుల్లా షికార్లు!
ABN, Publish Date - Jul 01 , 2024 | 05:33 PM
భార్యభర్తలు విడాకులు తీసుకుంటే ఒకరికొకరు ఎదురుపడటానికే ఇష్టపడరు.అలాంటి పరిస్థితి రావాలని కూడా కోరుకోరు. అలాంటిది సన్నిహితులుగా మెలగగలరా?
భార్యభర్తలు విడాకులు తీసుకుంటే ఒకరికొకరు ఎదురుపడటానికే ఇష్టపడరు.అలాంటి పరిస్థితి రావాలని కూడా కోరుకోరు. అలాంటిది సన్నిహితులుగా మెలగగలరా? బాలీవుడ్లో ఓ జంట మాత్రం విడాకుల తర్వాత కూడా స్నేహంగా మెలుగుతున్నారు. ఒకరికొకరు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్(Aamir Khan), దర్శకురాలు కిరణ్‌రావు వివాహబంధానికి స్వస్తి చెప్పి చాలా కాలమైంది. అయినా సరే దంపతుల్లా కలిసి షికార్లు చేస్తుంటారు. పలు వేడుకలకు కలిసి వెళ్తుంటారు. వీరిద్దరూ తమ కుమారుడు ఆజాద్‌తో కలిసి జూన్ 30న బయటకు వెళ్లారు. సండేను ఫండేగా ఎంజాయ్ చేసి రావ్- ఖాన్ హాలీడే అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
ఫ్రెండ్స్‌తో కలిసి ఓ ఫోటోలు దిగారు. ఇకపోతే ఆమిర్ ఖాన్ ఇటీవలే తన తల్లి జీనత్ హుేస్సన్ 90వ బర్త్‌డే గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ పుట్టినరోజు వేడుకలు ప్రత్యేకంగా ఉండాలని బంధువులును, జీనత్ స్నేహితుల ఇంటికి వెళ్లి మరీ సెలబ్రేషన్స్‌కు ఆహ్వానించాడు. అలా జీనత్ బర్త్‌డే కాస్తా ఆత్మీయ సమ్మేళనంగా మారింది. ఈ వేడుకల్లో ఆమిర్ ఇద్దరు మాజీ భార్యలు కిరణ్ రావు, రీనా దత్తా కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.