Katrina Kaif: కత్రినా.. ఆ మచ్చ ఏంటి

ABN, Publish Date - Oct 05 , 2024 | 05:44 PM

కత్రినా వస్త్రాలంకరణపై ఫోకస్ పెట్టిన మీడియా ప్రతినిధులకు ఓ చిత్రం అనుమానాలకి దారి తీసింది. దీంతో ఆమె అభిమానులు కంగారుపడుతున్నారు. ఇంతకీ కెమెరా కన్నులకి ఎం చిక్కింది. కత్రినాకి ఏమైందంటే..

KATRINA

కత్రినా కైఫ్(Katrina Kaif).. అందంతో పాటు అభినయం ఆమె సొంతం. కేవలం గ్లామర్‌తోనే కాదు తన మార్క్ యాక్టింగ్‌తో బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల నుండి అగ్రతారగా వెలుగుతుంది. తాజాగా ముంబై కలీనా ఎయిర్పోర్ట్‌లో జరిగిన నవరాత్రి ఉత్సవాలలో ఆమె మల్టీ‌కలర్ శారీలో అందరిని ఎప్పటిలాగే ఆకట్టుకుంది. అయితే వస్త్రాలంకరణపై ఫోకస్ పెట్టిన మీడియా ప్రతినిధులకు ఓ చిత్రం అనుమానాలకి దారి తీసింది. దీంతో ఆమె అభిమానులు కంగారుపడుతున్నారు. ఇంతకీ కెమెరా కన్నులకి ఎం చిక్కింది. కత్రినాకి ఏమైందంటే..


ఓ జ్యువెలరీ బ్రాండ్ నిర్వహించిన నవరాత్రి ఉత్సాహాలకి నటీమణులు మలైకా అరోరా, కృతి సనన్, యాక్టర్ అజయ్ దేవగన్(Ajay Devgn) మొదలగు సెలబ్రిటీలతో కత్రినా ఈ ఈవెంట్‌కి హాజరయ్యారు.సెలబ్రిటీలు కనపడగానే కెమెరా కన్నులు క్లిక్‌మన్నాయి. ఈ క్రమంలో కత్రినా చేతిపై నల్లటి ప్యాచ్ కనపడింది. ఇలాంటి ప్యాచ్ సాధారణంగా షుగర్ వ్యాధితో బాధపడే రోగులు ధరిస్తారు. దీంతో కత్రినా ఆరోగ్యం బాగానే ఉందా అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ఇది 'అల్ట్రాహుమాన్ ఫిట్‌నెస్ ట్రాకర్' కావొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఓ మీడియా సంస్థ డైరెక్ట్‌గా కత్రినా టీమ్‌ని కాంటాక్ట్ అయ్యింది. వారు తెలిపిన వివరాల ప్రకారం అదొక ఫిట్‌నెస్ ట్రాకర్ అని హార్ట్ బీట్, కేలరీస్, స్లీప్ యాక్టివిటీ లాంటి మరికొన్నింటిని ట్రాక్ చేయడానికి కత్రినా అది ధరించిందని నిర్దారించారు. దీంతో హమ్మయ్య అంటూ ఫ్యాన్స్‌తో సహా అందరు ఊపిరిపీల్చుకున్నారు.


మరోవైపు కత్రినా తన నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. చివరిగా ఆమె విజయ్ సేతుపతి(Vijay Sethupathi)తో నటించిన 'మేరీ క్రిస్‌మస్'(Merry Christmas) చిత్రంతో శ్రీరామ్ రాఘవన్ లాంటి విమర్శకుల నుండి ప్రశంసలు పొందింది. కత్రినా 2021లో బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్‌(Vicky Kaushal)ని పెళ్లాడింది. వీరి జంట బాలీవుడ్‌లోనే మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటడ్ పెయిర్‌గా ముద్రేసుకుంది.

Also Read- Prakash Raj: పవన్ కళ్యాణ్‌పై మరో ట్వీట్ పేల్చిన ప్రకాశ్ రాజ్..

Also Read- Thalapathy 69: విజయ్ లాస్ట్ సినిమా ఓపెనింగ్‌లో ఏం జరిగిందో తెలుసా?

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 05 , 2024 | 06:42 PM