Bhool Bhulaiyaa 3: హైదరాబాద్‌లో రూహ్ బాబా సంద‌డి

ABN, Publish Date - Oct 21 , 2024 | 09:04 AM

కార్తీక్ ఆర్య‌న్, ట్రిప్టి డిమ్రి, విద్యా బాల‌న్, మాధురి దీక్షిత్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన కామెడీ హ‌ర్ర‌ర్‌ చిత్రం భూల్ భూలయ్యా3. తాజాగా ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా కార్తిక్ ఆర్యన్,విద్యాబాల‌న్‌ హైదరాబాద్‌లో సంద‌డి చేశారు.

karthik

కార్తీక్ ఆర్య‌న్ ( Kartik Aaryan), ట్రిప్టి డిమ్రి (Triptii Dimri), విద్యా బాల‌న్ (Vidya Balan), మాధురి దీక్షిత్ (Madhuri Dixit) కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన కామెడీ హ‌ర్ర‌ర్‌ చిత్రం భూల్ భూలయ్యా3 (Bhool Bhulaiyaa 3). మొద‌ట‌గా 2007, 2022ల‌లో వ‌చ్చిన ఈ సిరీస్‌ చిత్రాల‌కు సీక్వెల్‌గా రూపొందిన ఈ నూత‌న మూవీ ట్రైల‌ర్‌ను ఆక్టోబ‌ర్ 9న రిలీజ్ చేయ‌గా విశేష ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుంది. అంతేకాదు తాజాగా విడుద‌ల చేసిన టైటిల్ ట్రాక్‌ త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ‌మంది వీక్షించిన సాంగ్‌గా రికార్డుల్లోకెక్కింది. ఈ మూవీ న‌వంబర్ 1న‌ దీపావళికి గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమైంది.

అయితే ఈ భూల్ భూలయ్యా 3 టైటిల్ ట్రాక్ లాంచ్ ప్రమోషనల్ టూర్‌, సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా కార్తిక్ ఆర్యన్ హైదరాబాద్‌లో సంద‌డి చేశారు. మొద‌ట‌ ఢిల్లీలో ప్రారంభ‌మైన ఈ టూర్‌ ఆ తర్వాత ఇండోర్‌కు అక్క‌డి నుంచి ఇప్పుడు హైదరాబాద్ చేరుకుంది. ఈ సంద‌ర్భంగా సినిమా యూనిట్ మొదట DSR స్కూల్‌ని, రెస్టారెంట్ల‌కు, మాల్స్‌కు వెళ్లి ఫ్యాన్స్‌ను క‌లిశారు. ఆపై OG మంజులిక‌, విద్యాబాలన్‌తో కలిసి కార్తీక్ ఆర్యన్ (రూహ్ బాబా) ప్రో కబడ్డీ లీగ్‌కు వెళ్లి అక్క‌డ ప్రేక్ష‌కుల‌ను, ఆట‌గాళ్ల‌ను ఉత్సాహ‌ప‌రిచారు. విడుద‌ల‌కే ముందే దేశ‌వ్యాప్త‌గా మంచి బ‌జ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాకు అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు.

Updated Date - Oct 21 , 2024 | 09:04 AM