Karan Johar: కరణ్ జోహార్ ప్రొడక్షన్ హౌస్ అమ్మేశాడు.. ఎన్ని వేల కొట్లో తెలుసా!
ABN, Publish Date - Oct 21 , 2024 | 05:49 PM
బాలీవుడ్ టాప్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హోస్ట్ కరణ్ జోహార్ తన నిర్మాణ సంస్థ 'ధర్మ ప్రొడక్షన్స్'ని అమ్మేశాడు. ప్రముఖ వ్యాపారవేత్త కొన్ని కోట్లు పెట్టి ఈ సంస్థని కొన్నారు. ఇంతకీ ఏమైందంటే..
బాలీవుడ్ టాప్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హోస్ట్ కరణ్ జోహార్ (Karan Johar) దేశవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీని ప్రభావితం చేయగలిగే అతికొద్ది మందిలో ఒకరు. ఐకానిక్ చిత్రాలకు దర్శకత్వం వహించి మామూలు హీరో, హీరోయిన్లుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే సొంతం. కేవలం హిందీలోనే కాకుండా దేశంలోని చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి సినిమాకి ఆయన సపోర్ట్ చేస్తూ తన ప్రొడక్షన్ హౌజ్ ధర్మతో దూసుకెళ్తున్నాడు. మరోవైపు హోస్ట్ గా 'కాఫీ విత్ కరణ్' మాత్రమే కాకుండా హోస్ట్ చేసిందల్లా బంగారమే అన్నట్లు ప్రతిదీ సూపర్ హిట్ అయ్యాయి. అయితే, తాజాగా ఆయన తన ప్రొడక్షన్ 'ధర్మ'ని అమ్మకానికి పెట్టాడు. ఒక ప్రముఖ టీకాల తయారీ సంస్థ కోట్లు కొల్లగొట్టే డీల్ తో కైవసం చేసుకుంది. ఇంతకీ ఆ కంపెనీ ఏంటి, ఎంతకొన్నారు అంటే..
గత కొన్ని రోజులుగా కరణ్ జోహార్ తన నిర్మాణ సంస్థ 'ధర్మ ప్రొడక్షన్స్' (Dharma Productions) ని అమ్మకానికి పెట్టినట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమే అని క్లారిటీ రామవడంతో సినీ సర్కిల్స్ షాక్ కి గురవుతున్నాయి. కరణ్ 'ధర్మ'లోని 50% షేర్ ని ప్రముఖ టీకాల తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ (Serum Institute of India) అధినేత అదర్ పూనావాలా (Adar Poonawalla) రూ.1000 కోట్లకు దక్కించుకున్నాడు. కాగా మరో 50% కరణ్ పేరు మీదే ఉండనుంది. ఈ నిర్మాణా సంస్థకి కరణ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా కొనసాగుతూ క్రియేటివ్ వర్క్స్ చేసుకోనున్నాడు. ఇక కరణ్ ఆప్త మిత్రుడు అపూర్వ మెహతా దీనికి సీఈవోగా కొనసాగనున్నాడు. సినిమా నిర్మాణ పనుల్లో పునావాలా కూడా భాగమవుతారని తెలుస్తోంది.