Kangana Ranaut: సెన్సార్ తీరు.. చాలా బాధగా ఉంది
ABN, Publish Date - Sep 06 , 2024 | 06:21 PM
కంగనా రనౌత్ (kangana Ranut) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ (Emergency) విడుదల మరోసారి వాయిదా పడింది. ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా మరికొన్ని రోజులు ఆలస్యంగా విడుదల కానుంది.
కంగనా రనౌత్ (kangana Ranut) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ (Emergency) విడుదల మరోసారి వాయిదా పడింది. ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా మరికొన్ని రోజులు ఆలస్యంగా విడుదల కానుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. పలు కారణాల వల్ల, కంగనా రాజకీయాలతో బిజీగా కావడం వల్ల దీని విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయని కారణంగా మరోసాకి రిలీజ్ వెనక్కి వెళ్లింది. దీనిపై కంగనా భావోద్వేగంగా పోస్ట్ పెట్టారు.
‘నా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ (Emergency Movie) మరోసారి వాయిదా పడిందని చెప్పడానికి బాధగా ఉంది. సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ కోసం మేము ఇంకా ఎదురుచూస్తున్నాం. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. మమ్మల్ని అర్థం చేసుకుంటున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని కంగనా ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ పెట్టారు. ‘ఎమర్జెన్సీ’ సెన్సార్ సర్టిఫికెట్ కోసం బాంబే హైకోర్టును సంప్రదించిన కంగనాకు అక్కడ ఊరట లభించలేదు. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ను తాము ఆదేశించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ చిత్రం వాయిదా పచి?ంది ప్రచార చిత్రాలు విడుదలైనప్పటి నుంచే ఈ చిత్రంపై విమర్శలు వచ్చాయి. అందులో తమ వర్గం గురించి తప్పుగా చిత్రీకరించారంటూ శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. కంగన ఈ విషయంపై హత్య బెదిరింపులు కూడా ఎదుర్కొన్నారు. భారతదేశంలో చీకటి రోజులు గా పిలిచే ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు. ఇందులో కంగనా.. ఇందిరా గాంధీ పాత్ర పోషించారు. అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు.