Emergency: ఇందిరా ఈజ్ ఇండియా.. ‘ఎమర్జెన్సీ’ హిందీ ట్రైలర్! మరో వివాదం గ్యారంటీ
ABN, Publish Date - Aug 14 , 2024 | 05:46 PM
బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ నటించడంతో పాటు, నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రం ఎమర్జెన్సీ. తాజాగా ఈసినిమా ట్రైలర్ విడుదల చేశారు.
బాలీవుడ్ అగ్ర నటి, ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) కాస్త విరామం తర్వాత నటించిన చిత్రం ఎమర్జెన్సీ. తాజాగా ఈసినిమా ట్రైలర్ విడుదల చేశారు. 1975 నుంచి 1977ల మధ్యలో ఇందిరాగాందీ ప్రభుత్వం అధికారంలో జరిగిన ఎమర్జెన్సీ (Emergency) పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.
కంగనా ఈ సినిమాలో ఇందిరాగాంధీగా నటించగా అనుపమ్ ఖేర్ (Anupam Kher) జయప్రకాశ్ నారాయణ్‌గా, శ్రేయాస్ తల్పడే (Shreyas Talpade) వాజపేయి పాత్రల్లో నటించారు. ఈసినిమాను రేణు పిట్టితో కలిసి కంగనా(Kangana Ranaut)నే నిర్మించడమే కాక దర్శకత్వం వహించడం విశేషం. కాగా ఈ సినిమాను సెప్టెంబర్6న థియేటర్లలోకి తీసుకురానున్నారు.
అయితే ఈ మూవీ ట్రైలర్‌ను చూస్తుంటే సినిమా విడుదలయ్యే సమయానికి ఈ చిత్రం యుట్టూ చాలా వివాదాలే చుట్టుముట్టేలా ఉన్నాయి. ఎమర్జెన్సీ సమయంలో దేశ వ్యాప్తంగా అమలు జేసిన ప్రత్యేక చట్టాలు, తీసుకున్న నిర్ణయాలు, సంజయ్ గాందీ ఎపిసోడ్ వంటి హార్డ్ హిట్టింగ్ ఇష్యూల చుట్టూ రసవత్తరంగా సినిమాను మలిచినట్లు తెలుస్తోంది.
కాగా కంగనా బీజేపీ ఎంపీ కావడం, ఇందులో నటించిన వారు కాస్త ఆ పార్టీకి అనుకూలమైన వారు ఎక్కువగా ఉండడం ఇత్యాధి అంశాలతో సినిమా ఒక పార్టీని తక్కువగా, తప్పుగా చూయించారనే వాదన పక్కగా రావొచ్చని తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి పరిస్థితులు తీసుకువస్తుందో. ముఖ్యంగా ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిర అనే డైలాగ్స్ సినిమా నేపథ్యాన్ని బలంగా తెలియజేస్తుంది.