DDLJ: ఐకానిక్ చిత్రానికి 29 ఏళ్ళు.. ఇంకా థియేటర్లలో రన్ అవుతోంది తెలుసా!

ABN, Publish Date - Oct 21 , 2024 | 05:27 PM

షారూక్‌ఖాన్‌, కాజోల్‌ జంటగా నటించిన చిత్రం 'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగె' సినిమా విడుదలై 29 ఏళ్ళు పూర్తవుతోంది. తాజాగా ఈ సినిమా హీరోయిన్ కాజోల్ తనదైన స్టైల్‌లో ఈ సినిమాకి ట్రిబ్యూట్ తెలిపారు. ఇంతకీ ఏం చేశారంటే..

షారూక్‌ఖాన్‌, కాజోల్‌ జంటగా నటించిన చిత్రం 'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగె' సినిమా విడుదలై 29 ఏళ్ళు పూర్తవుతోంది. ఆదిత్య చోప్రా దర్శకత్వంలో యష్‌ చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఓ క్లాసిక్‌ మూవీగా నిలిచిపోయింది. సినిమాలోని పాటలు ఇప్పటికీ, ఎప్పటికీ మనల్ని అలరిస్తూనే ఉంటాయి. తాజాగా ఈ సినిమా హీరోయిన్ కాజోల్ తనదైన స్టైల్‌లో ఈ సినిమాకి ట్రిబ్యూట్ తెలిపారు. ఇంతకీ ఏం చేశారంటే..


'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగె' ఈ ఫిల్మ్‌లో నటించిన, పనిచేసిన ప్రతొక్కరికి ఎంతో ప్రత్యేకం. షారుఖ్, కాజోల్, అమ్రిష్ పూరి, అనుపమ్ ఖేర్ మిగతా యాక్టర్లందరూ తమ కెరీర్‌లోనే ఉత్తమ ప్రదర్శన ఇచ్చారు. ఉత్తర, పశ్చిమ భారతీయలు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే పండగ 'కర్వా చౌత్'. కర్వా చౌత్ నాడు మహిళలు తమ భర్తల భద్రత, దీర్ఘాయువు కోసం సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసాన్ని పాటిస్తారు. అలాగే సాయంత్రం సమయంలో మహిళలు జల్లెడల ద్వారా చంద్రుడిని చూసి తమ భర్త మొహాన్ని చూస్తారు. ఈ పండుగని సెలబ్రేట్ చేసుకునే ఐకానిక్ సీన్ ఈ సినిమాలో ఉంటుంది. అయితే కర్వా చౌత్ నాడే సినిమా 29వ యానివర్సరీ రావడంతో కాజోల్ అందరికి కర్వా చౌత్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆ సీన్‌ని గుర్తుకు చేసుకున్నారు. ఆ పోస్ట్‌కి ఫన్నీగా సినిమా రిఫరెన్స్ గుర్తు చేస్తూ.. అందరికి సక్సెస్ ఫుల్ అండ్ హంగ్రీ కర్వా చౌత్ విషెస్ చెబుతూ.. ఇది జీరో క్యాలరీస్ టిప్ అంటూ నవ్వింది.


మరోవైపు ఈ సినిమా రిలీజై 29 ఏళ్ళైనా మహారాష్ట్రలోని మరాఠీ మందిర్ థియేటర్‌లో 29 ఏళ్లుగా రన్ అవుతూనే ఉంది. దీంతో కాజోల్ ఆ థియేటర్‌కి వెళ్లాలని ఉందని పోస్ట్ చేసింది. ఈ థియేటర్‌లో అతి తక్కువ ప్రైజ్ కే ఈ సినిమా టికెట్లను విక్రయిస్తారు.

Updated Date - Oct 21 , 2024 | 05:29 PM