Devara: 'దేవర' హిందీ వెర్షన్‌లో కోత‌.. ఎందుకో తెలుసా?

ABN, Publish Date - Sep 27 , 2024 | 01:29 PM

ఆరేళ్ళ తర్వాత ఎన్టీయార్ సోలో రిలీజ్ కావడంతో తెలుగు రాష్ట్రలోను దేవర ప్రభంజనం మాములుగా లేదు. హిందీలో మాత్రం సీన్ భిన్నంగా ఉంది. సినిమా టాక్, బుకింగ్స్‌ని పక్కన పెడితే సినిమాలోనే మార్పులు చేయాల్సి వచ్చింది.

devara

నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజైన 'దేవర' సినిమా భారీ ఓపెనింగ్స్ తో దూసుకుపోతుంది. రివ్యూస్‌తో సంబంధం లేకుండా భారీ బుకింగ్స్ కారణంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ అటు ఓవర్సీస్‌లోను భారీ కలెక్షన్స్‌తో ముందుకు కొనసాగుతోంది. అయితే ఇప్పటికే ఇంటర్‌నెట్‌లో పలువురు పాజిటివ్ రివ్యూస్ ఇవ్వగా కొందరు నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. కాగా ఎక్కువగా పాజిటివ్ రివ్యూస్ రావడం విశేషం. మరోవైపు హిందీలో సీన్ భిన్నంగా కనిపిస్తోంది. సినిమా టాక్, బుకింగ్స్‌ని పక్కన పెడితే సినిమాలోనే మార్పులు చేయాల్సి వచ్చింది.

‌ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తారక్‌కి హిందీలోనూ తగినంత గుర్తింపు లభించింది. ఓ వైపు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌‌లో భారీ బుకింగ్స్‌తో దూసుకెళ్లిన దేవరకి హిందీలో బుకింగ్స్ ఊహించిన రేంజ్‌లో రాలేదు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 2 గంటల 50 నిమిషాల రన్‌ టైమ్‌‌తో విడుదల చేశారు. కాగా హిందీ వెర్షన్‌లో మాత్రం ఏడు నిమిషాల నిడివి తగ్గించి 2 గంటల 43 నిమిషాల రన్‌ టైమ్‌‌కి కుదించారు. తెలుగు నటీనటుల సోలో ఇంట్రడక్షన్ పార్ట్స్‌తో పాటు కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది అడ్వాంటేజే అని సినీ విశ్లేషకులు అంటున్నారు.


హిందీ ఆడియెన్స్ తక్కువ నిడివి ఉన్న సినిమాలకే ప్రాముఖ్యత ఇస్తారని దీని ద్వారా సినిమా కూడా ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా కనిపిస్తుందని అంటున్నారు. సాయంత్రం వరకు సినిమా పాజిటివ్ టాక్ వినిపిస్తే హిందీలో కూడా బుకింగ్స్ పెరిగి కలెక్షన్స్ పెరిగే అవకాశముంది. ఈ రోజు సాయంత్రం వరకు ఒరిజినల్ టాక్ బయటకొస్తుంది.

ఇక ఆరేళ్ళ తర్వాత ఎన్టీయార్ సోలో రిలీజ్ కావడంతో తెలుగు రాష్ట్రలో దేవర ప్రభంజనం మాములుగా లేదు. రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్‌తో పాటు పాజిటివ్ టాక్ వినిపిస్తుండటం‌తో ఈ సినిమా మొదటి రోజే వంద కోట్లు కొల్లగొట్టేల కనిపిస్తుంది. అయితే ఇదే పాజిటివ్ టాక్ కొనసాగితే అటు నార్త్‌లోను పుంజుకొని అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల జాబితాలో దేవర చేరే అవకాశముంది.

Updated Date - Sep 27 , 2024 | 01:29 PM