Jigra: రానా విడుదల చేయడానికి కారణం ఏంటో తెలుసా 

ABN, Publish Date - Sep 29 , 2024 | 04:13 PM

ఆలియా భ‌ట్(Alia bhatt) వేదాంగ్ రైనా (Vedang Raina) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న  చిత్రం  ‘జిగ్రా’ (Jigra). వాసన బాల దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌లో మంచి అంచ‌నాలున్న ఈ చిత్రాన్ని హీరో రానా ద‌గ్గుబాటి ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేయ‌టానికి సిద్ధ‌మ‌య్యారు.

ఆలియా భ‌ట్(Alia bhatt) వేదాంగ్ రైనా (Vedang Raina) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న  చిత్రం  ‘జిగ్రా’ (Jigra). వాసన బాల దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌లో మంచి అంచ‌నాలున్న ఈ చిత్రాన్ని హీరో రానా ద‌గ్గుబాటి ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేయ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టికే ఈ సినిమా హిందీ ట్రైల‌ర్ విడుద‌లై అంచ‌నాల‌ను పెంచిన సంగ‌తి తెలిసిందే. తెలుగు ట్రైల‌ర్‌ను  గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ విడుద‌ల చేశారు. 

ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ సి.ఇ.ఒ అపూర్వ మెహ‌తా మాట్లాడుతూ
‘‘ప్రతిష్టాత్మక చిత్రమైన బాహుబలి, ఘాజి ఎటాక్ వంటి సినిమాల‌తో ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌తో రానా ద‌గ్గుబాటికి మంచి అనుబంధం ఏర్ప‌డింది. ఇప్పుడు ‘జిగ్రా’ తెలుగు విడుద‌ల కోసం రానాతో, ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్ సంస్థ‌తో చేతులు క‌ల‌ప‌టం గ‌ర్వంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్ష‌కుల‌కు మంచి సినిమాల‌ను అందించాల‌నే మా అంకిత‌భావం మ‌రోసారి దీంతో స్ష‌ష్ట‌మ‌వుతోంది. తెలుగు  ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలైన ఆలియా భ‌ట్‌తో పాటు వేదాంగ్ రైనా అద్భుతమైన న‌ట‌న ప్రేక్ష‌కుల‌కు ఓ గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌నుంది. దీనికి భాష‌, ప్రాంతీయ హ‌ద్దులు ఉండ‌బోవు. జిగ్రా సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుద‌ల చేయ‌టానికి స‌మాయ‌త్త‌మ‌వుతున్నాం. ఇండియ‌న్ సినిమాలో భిన్న‌త్వంలో ఏక‌త్వాన్ని చాటుకోవ‌టానికి మ‌రో ముందడుగుగా మేం భావిస్తున్నాం’’ అన్నారు.

రానా ద‌గ్గుబాటి మాట్లాడుతూ
‘‘జిగ్రా క‌థ‌లో మంచి సోల్ ఉంది. భాష‌తో సంబంధం లేకుండా ఎవ‌రికైనా ఇది క‌నెక్ట్ అవుతుంది. ఇలాంటి వైవిధ్య‌మైన క‌థ‌తో రూపొందిన ఈ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించాల‌ని భావించాం.  ధ‌ర్మ ప్రొడక్ష‌న్స్‌తో క‌లిసి నేను, ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్ ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేస్తున్నామ‌ని గ‌ర్వంగా తెలియ‌జేస్తున్నాం. జిగ్రా అనేది కేవ‌లం యాక్ష‌న్ చిత్రం మాత్ర‌మే కాదు. కుటుంబంలోని అనుబంధాల‌ను తెలియ‌జేసే చిత్రం. మ‌నం ఎంతగానో ప్రేమించే వ్య‌క్తుల‌ను మనం ఎలా కాపాడుకోవాలో తెలియ‌జెప్పే సినిమా. ఆలియా భ‌ట్‌, వేదాంగ్ రైనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం భాష‌, స‌రిహ‌ద్దుల‌తో సంబంధం లేకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కుల‌కు అద్భుత‌మైన అనుభవాన్ని అందిస్తుంద‌న‌టంలో సందేహం లేదు’’ అన్నారు. వ‌యాకామ్ 18 స్టూడియోస్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌, ఎట‌ర్‌న‌ల్ షైన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కర‌ణ్ జోహార్, అపూర్వ మెహ‌తా, ఆలియా భ‌ట్‌, షాహిన్ భ‌ట్, సోమెన్ మిశ్రా నిర్మాత‌లుగా రూపొందిన ‘జిగ్రా’ చిత్రం అక్టోబ‌ర్ 11న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీగా విడుద‌ల‌వుతుంది.   


Updated Date - Sep 29 , 2024 | 04:14 PM