Janhvi Kapoor: ఆ పోస్ట్‌లను నమ్మొద్దు.. జాన్వీ ఉపయోగించేది ఆ ఒకటే!

ABN, Publish Date - Jun 18 , 2024 | 11:10 AM

తాజాగా జాన్వీకపూర్‌ పేరుతో ఉన్న ఓ ట్విట్టర్‌ అకౌంట్‌లో అసభ్యకరమైన పోస్ట్‌లు దర్శనమివ్వడంతో ఈ ఖాతా టీమ్‌ క్లారిటీ ఇచ్చింది.

తాజాగా జాన్వీకపూర్‌ (Janhvey kapoor) పేరుతో ఉన్న ఓ ట్విట్టర్‌ (Twitter Fake account) అకౌంట్‌లో అసభ్యకరమైన పోస్ట్‌లు దర్శనమివ్వడంతో ఈ ఖాతా టీమ్‌ క్లారిటీ (Janhvey team clarity) ఇచ్చింది. ‘అభివృద్ధి చెందుతున్న డిజిటల్‌ ప్రపంచంలో ఎవరి పేరుతోనైనా సోషల్‌ మీడియా ఖాతా క్రియేట్‌ చేయడం అతి సులభంగా మారింది. జాన్వీకపూర్‌కు అధికారికంగా ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతా లేదని మరోసారి క్లారిటీ ఇస్తున్నాం. దయచేసి ఈ ఫేక్‌ అకౌంట్‌లను ప్రోత్సహించకండి. వాటిని ఫాలో కావొద్దు. వీటిలో షేర్‌ చేసే సమాచారాన్ని నమ్మొద్దు. మీ అందరి సహకారానికి ధన్యవాదాలు. దయచేసి అప్రమత్తం ఉండండి’’ అని జాన్వీ టీమ్‌ కోరింది. ఆమె పేరుతో ఎక్స్‌లో ఉన్న నకిలీ ఖాతాల వివరాలను తెలిపింది. జాన్వీ ఫాన్స్ తో  టచ్లో  ఉండడం కోసం కేవలం ఇన్  స్టాగ్రామ్‌ని మాత్రమే ఉపయోగిస్తుందని టీమ్‌ స్పష్టం చేసింది. ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో సోషల్‌ మీడియా అంటే తనకు భయమని తెలిపింది జాన్వీ. రెడిట్‌ను తనకంటే తన చెల్లి ఖుషీనే ఎక్కువగా ఉపయోగిస్తుందని స్పష్టం చేసింది.  


బాలీవుడ్‌లో  ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్‌తో 'దేవర' (Devara)చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ థాయ్‌ల్యాండ్‌లో జరుగుతోంది. ఇటీవల చిత్ర బృందం థాయ్‌కు చేరుకుంది. అక్కడ తారక్‌, జాన్వీలపై ఓ పాటను తెరకెక్కిస్తారని తెలిసింది. ఈ చిత్రం కాకుండా రామ్‌చరణ్‌, బుచ్చిబాబు సానా  కాంబినేషన్లో  రాబోతున్న చిత్రానికి జాన్వీ సైన్  చేసింది. 

Updated Date - Jun 18 , 2024 | 11:11 AM