మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Netflix Ott: ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ'.. అడ్డంకులు తొలిగిపోయాయి..

ABN, Publish Date - Mar 01 , 2024 | 02:01 PM

షీనా బోరా హత్య కేసు దేశ వ్యాప్తంగా ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే! ఈ కేసుపై నెట్‌ఫ్లిక్స్‌ ఓ డాక్యుమెంటరీ రూపొందించింది. ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్‌ ట్రూత్‌’ టైటిల్‌తో తీసిన ఈ చిత్రం కొద్ది రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సిరీస్‌ తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా  స్ట్రీమింగ్  అవుతోంది.

షీనా బోరా హత్య కేసు (Sheena Bora case) దేశ వ్యాప్తంగా ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే! ఈ కేసుపై నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) ఓ డాక్యుమెంటరీ రూపొందించింది. ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్‌ ట్రూత్‌’ (Indrani Mukerjea Story) టైటిల్‌తో తీసిన ఈ చిత్రం కొద్ది రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సిరీస్‌ తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా  స్ట్రీమింగ్  అవుతోంది. షానా లెవీ, ఉరాజ్‌ బహల్‌ దర్శకత్వం వహించారు. 



షీనా బోరా హత్య కేసు గురించి...
2012లో షీనా బోరా హత్య జరగ్గా.. మూడేళ్ల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో అరెస్టైన ఇంద్రాణీ ముఖర్జియా డ్రైవర్‌ను విచారించగా.. ఈ విషయాన్ని బయటపెట్టారు. షీనాను ఇంద్రాణీ గొంతు నులిమి చంపేసిందని సదరు వ్యక్తి వెల్లడించాడు. దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. ఇంద్రాణీ మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత తన కుమార్తె షీనా, కుమారుడు మైఖేల్‌ను గువాహటిలోని తల్లిదండ్రుల వద్ద ఉంచింది. కొన్నాళ్లకు సంజీవ్‌ ఖన్నా అనే వ్యక్తిని వివాహం చేసుకుని, అతడి నుంచి విడిపోయింది. తర్వాత ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్‌ పీటర్‌ ముఖర్జియాను పెళ్లి చేసుకుంది. పెద్దయ్యాక తల్లి గురించి తెలుసుకున్న షీనా.. ముంబైకి వెళ్లి ఆమెను కలిసింది. పీటర్‌ మొదటి భార్య కుమారుడైన రాహుల్‌తో షీనాకు పరిచయం ఏర్పడి, అది ప్రేమకు దారి తీసింది. ఈ విషయంలో తల్లీకుమార్తె మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అది ఆర్థిక వివాదాల వరకూ వెళ్లింది. దీంతో విసిగిపోయిన ఇంద్రాణీ.. తన రెండో భర్త, సంజీవ్‌, డ్రైవర్‌ శ్యామ్‌ రాయ్‌ సహాయంతో కుమార్తెను హత్య చేసినట్లు దర్యాప్తులో తెలిసింది. ఇదే ఇతివృత్తంతో నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌గా తీసింది. మొదట ఈ సిరీస్‌ను ఫిబ్రవరి 23 నుంచి స్ర్టీమింగ్‌ చేయాలని నెట్‌ఫ్లిక్స్‌ డేట్‌ ప్రకటించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఓటీటీలో విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ సీబీఐ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన డివిజన్‌ బెంచ్‌.. దర్యాప్తు సంస్థలతోపాటు న్యాయస్థానం వీక్షించేందుకు ముందస్తుగా ప్రదర్శించాలని సదరు ఓటీటీ సంస్థను ఆదేశించింది. తాజాగా దీనిపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో విడుదలకు అడ్డంకులు తొలగిపోతాయి. దీనితో క్లియరెన్సు రావడంతో నెట్ ఫ్లిక్ ఓటీటీ  వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.  




Updated Date - Mar 01 , 2024 | 02:17 PM