KILLMovie: జాన్‌ విక్కా తొక్కా.. ఇదేం సినిమారా నాయనా!ట్రైలరే ఈ రేంజ్‌లో ఉంది

ABN, Publish Date - Jul 02 , 2024 | 07:00 PM

హాలీవుడ్ జాన్ విక్ చిత్రాల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత ఆద‌ర‌ణ‌, డిమాండ్ ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఆ చిత్రాన్ని తల‌ద‌న్నేలా ఇంకా చెప్పాలంటే జాన్‌విక్ ఏ మాత్రం ప‌నికి రాదనేలా బాలీవుడ్‌లో ఓ భారీ హిందీ చిత్రం తెర‌కెక్కింది.

kill

హాలీవుడ్ జాన్ విక్ (John Wick) చిత్రాల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత ఆద‌ర‌ణ‌, డిమాండ్ ఉంటుంద‌దో అంద‌రికీ తెలిసిందే. ఆ సినిమాకంటూ ప్ర‌స్తుతం అన్ని దేశాల‌లోనూ ప్ర‌త్యేక‌మైన‌ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. నో లాజిక్ ఫ‌స్ట్ నుంచి చివ‌రి వ‌ర‌కు వేసుకుంటూ వెళ్ల‌డ‌మే అనే కాన్సెప్ట్‌తో వ‌చ్చిన ఈ చిత్రం ఇప్ప‌టికే నాలుగు భాగాలుగా వ‌చ్చి ఒకదాన్ని మించి మ‌రోటి క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టి స‌రికొత్త రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. తాజాగా ఇప్పుడు ఆ చిత్రాన్ని తల‌ద‌న్నేలా ఇంకా చెప్పాలంటే జాన్‌విక్ ఏ మాత్రం ప‌నికి రాదనేలా బాలీవుడ్‌లో ఓ భారీ హిందీ చిత్రం తెర‌కెక్కింది.

ల‌క్ష్య (Lakshya) హీరోగా, నిఖిల్ న‌గేష్‌భ‌ట్ (Nikhil Nagesh Bhat) ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రం ‘కిల్’ (Kill). హాలీవుడ్ జాన్ విక్ (John Wick) సినిమా మాదిరి క‌థతో వ‌స్తున్న ఈ చిత్ర ట్రైల‌ర్ ప‌క్షం రోజుల క్రితం విడుద‌ల చేయ‌గా జ‌నాల్లోకి బాగా చొచ్చుకుపోయింది. ప్ర‌పంచ వ్యాప్తంగా అంద‌రి దృష్టిని త‌న వైపు తిప్పుకునేలా చేసి సినిమా కోసం వెయిట్ చేస్తున్న యూత్‌ను పిచ్చెక్కి పోయేలా మార్చిందన‌డంలో ఏం సందేహం లేదు. అంత‌లా సంచ‌ల‌నం సృష్టించింది కిల్ (Kill) చిత్రం ట్రైల‌ర్‌.

అస‌లు ట్రైల‌ర్‌లో ఏముందంటే.. త‌ను ప్రేమించిన తులికకు త‌న‌కు ఇష్టం లేకుండా మ‌రొక‌రితో ఎంగేజ్‌మెంట్ అయింద‌ని, పెళ్లిని ఎలాగైనా అడ్డుకోవాల‌ని ఢిల్లీకి రైలులో బ‌య‌లుదేరుతాడు ఆర్మీ క‌మెండో అమృత్‌. అయితే అదే ట్రైన్‌లో ఓ క్రూర‌మైన దొంగ‌ల ముఠా చేరి ప్ర‌యాణికుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తూ, హింసిస్తూ అంద‌రి ద‌గ్గ‌ర దోచుకుంటుంటారు, చంపేస్తుంటారు. దీంతో అమృత్ త‌న వారిని, ప్ర‌యాణికుల‌ను ర‌క్షించేందుకు స్వ‌యంగా రంగంలోకి దిగుతాడు.


క‌నిపించిన వ‌స్తువుతో దొరికిన వాడిని దొరికిన‌ట్టు న‌రుక్కుంటూ పోతాడు. జాలీ ద‌య లేకుండా క‌ల‌లో కూడా ఊహించ‌ని విధంగా ప్ర‌త్య‌ర్థులను వేటాడే నేప‌థ్యంలో ఈ సినిమా అద్యంతం భారీ హింసాత్మ‌క స‌న్నివేశాల‌తో సాగుతూ ఉంటుంది. ప్ర‌త్య‌ర్థులే జంకుతూ ప్రాణాలు గుప్పిట్లో ప‌ట్టుకుని ఉండే యాక్ష‌న్ సీన్స్‌తో సినిమాను ఆస‌క్తి క‌రంగా జాన్ విక్‌ సినిమాలను మైమ‌రిపించేలా తెర‌కెక్కించారు. ఈ క్ర‌మంలోనే కిల్ (Kill) ట్రైల‌ర్ చూసిన వారంతా ఇప్పుడు ఈ మూవీ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ చిత్రంపై అంచ‌నాలు ఆకాశ‌న్నంట‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా జూలై 5న థియేట‌ర్ల‌లోకి రానుంది. గ‌త సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్‌లో ఈ చిత్రాన్ని టొరంటో ఫిల్మ్ ఫెస్టివ‌ల్లో ప్ర‌ద‌ర్శించ‌గా మంచి అప్లాజ్ రావ‌డ‌మే కాక హాలీవుడ్ వారి దృష్టి ఈ చిత్రంపై ప‌డింది. దీంతో జాన్ విక్ (John Wick) సినిమాల‌ను రూపొందించిన ల‌య‌న్స్ గేట్ (Lionsgate), 87 ఎల‌వెన్ ఎంట‌ర్ టైన్‌మెంట్ (87 Eleven Entertainment) ఈ బాలీవుడ్‌ కిల్ (Kill) చిత్రాన్ని హాలీవుడ్‌లో రిమేక్ చేయనున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

బాలీవుడ్‌ అగ్ర నిర్మాత‌ క‌ర‌ణ్ జోహర్ (Karan Johar) గునీత్ మోంగా (Guneet Monga), అపూర్వ మెహ‌తా (Apoorva Mehta), అచిన్ జైన్ (Achin Jain) తో క‌లిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తాన్య మానిక్తలా (Tanya Maniktala), రాఘ‌వ్ జుయ‌ల్ (Raghav Juyal), అశిష్ విద్యార్థి (Ashish Vidyarthi), హ‌ర్స్ ఛాయా (Harsh Chhaya) ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

Updated Date - Jul 02 , 2024 | 07:27 PM