Pankaj Udhas: విషాదం.. ప్రముఖ గజల్ గాయకుడు ‘పంకజ్ ఉదాస్’ కన్నుమూత
ABN, Publish Date - Feb 26 , 2024 | 04:56 PM
ప్రముఖ గజల్ గాయకుడు, క్లాసికల్ సింగర్ పద్మశ్రీ పంకజ్ ఉదాస్(73) తుది శ్వాస విడిచారు. సుదీర్ఘ అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఈ రోజు (ఫిబ్రవరి 26)న మరణించినట్లు ఆయన కుమార్తె నయాబ్ ఉదాస్ ధ్రువీకరిస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
ప్రముఖ గజల్ గాయకుడు, క్లాసికల్ సింగర్ పద్మశ్రీ పంకజ్ ఉదాస్(73) (Pankaj Udhas) తుది శ్వాస విడిచారు. సుదీర్ఘ అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఈ రోజు(ఫిబ్రవరి 26)న మరణించినట్లు ఆయన కుమార్తె నయాబ్ ఉదాస్ ధ్రువీకరిస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
భారత్‌లో సుపరిచతమైన గజల్ సింగర్ పంకజ్ ఉదాస్ (Pankaj Udhas) 1951 మే 17వ తేదీన జన్మించారు. ఆయన తన గజల్ ఆలాపనలతో ప్రసిద్ధి చెందారు. 1980, 90 దశకాల్లో ఆయన తన కెరీర్ ఉచ్ఛ దశలో ఉన్నారు. మన దేశంలోని ప్రముఖ గజల్ సింగర్‌లలో ఒకరిగా నిలిచారు. ఆయన శ్రావ్యమైన, మెలోడియస్ గళంతో ఉద్వేగభరిత గాన కచేరీలు చేశారు. ఆయన గాత్రానికి మన దేశంలోనే కాక విదేశాలలోనూ అభిమానులు భారీగా ఉన్నారు.
చిట్టి ఆయిహై, ఔర్ అహిస్తా కీజియే బాతే, చాంది జైసా రంగ్ హై తేరా, న కజ్రే కి దార్ వంటి గజల్స్ పంకజ్ ఉదాస్ (Pankaj Udhas) పాడిన వాటిల్లో పేరేన్నిక గలవి. మరికొందరు సంగీత కళాకారులతో కలిసి ఆయన పలు పాటల ఆల్బమ్‌లు విడుదల చేశారు. సంగీత పరిశ్రమలో చేసిన కృషికి గాను ప్రభుత్వం ఆయనకు 2006లో పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించింది. ఆయన అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం జరుగనున్నాయి.
ఇదిలాఉండగా.. పంకజ్ ఉధాస్ మరణంపై తెలుగు ప్రఖ్యాత గజల్ గాయకుడు డా.గజల్ శ్రీనివాస్ స్పందిస్తూ.. ఓ సోషల్‌మీడియాలో పోస్టు పెట్టారు. ‘పంకజ్ ఉధాస్ జి మరణించారన్న వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన ఒక గొప్ప గజల్ గాయకుడు. హిందీ , ఉర్దూ గజళ్ళను సామాన్య శ్రోత వరకూ తీసుకు వెళ్ళిన ఘనత ఆయనదే. ఆయన నాకు గొప్ప మిత్రులు. వారానికి ఒకసారన్నా చాటింగ్ చేసుకునే స్నేహం & ఆత్మీయత. వారితో కలసి వేదికలు పంచుకున్నాము. ప్రయాణాలు చేసాము. గజల్ ప్రక్రియ బాధతో ఈ రోజు "గజల్" పాడుకుంటుంది. వారి కుటుంబానికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నా’. అంటూ శ్రద్ధాంజలి ఘటించారు.